ఎస్సీ వర్గీకరణలో ప్రభుత్వాల విధానం మారాలి :  పిల్లి సుధాకర్​

ఎస్సీ వర్గీకరణలో ప్రభుత్వాల విధానం మారాలి :  పిల్లి సుధాకర్​

కూసుమంచి,వెలుగు : ఎస్సీ వర్గీకరణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ విధానాలను మార్చుకోవాలని జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు పిల్లి సుధాకర్​ అన్నారు. భద్రాచలం నుంచి హైదరాబాద్ వరకు కొనసాగుతున్న మాలల మహాపాదయాత్ర  గురువారం ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం చేరుకుంది. మాజీ ఎంపీపీ కొప్పుల అశోక్, మాల మహానాడు మండల అధ్యక్షుడు పప్పుల ప్రసాద్,యూనిటీ ఆఫ్ మాల మండల అధ్యక్షుడు గుజ్జ రామకృష్ణ కలిసి పాదయాత్ర బృందం సభ్యులను పూలమాలతో సత్కరించారు.