విశాఖలో ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ

విశాఖలో ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ

ఆంధ్రప్రదేశ్ విశాఖలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఫ్లీట్ రివ్యూ నిర్వహించారు.PFR లో ప్రెసిడెన్షియల్ యాచ్ గా ఉన్న INS సుమిత్ర నుంచి మొత్తం 60 యుద్ధనౌకలను త్రివిధ దళాధిపతి హోదాలో రాష్ట్రపతి సమీక్షించారు.భారతీయ నౌకాదళాలకు చెందిన యుద్ధ విమానాలన్నీ ఏకకాలంలో పైకి ఎగిరి రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పించుకున్నాయి. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటు.. ఏపీ గవర్నర్, అండమాన్ నికోబార్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ డీకే జోషి పాల్గొన్నారు. 

ప్రాజెక్ట్-15 B పేరుతో పూర్తి దేశీయంగా నాలుగు స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ యుద్ధ నౌకలను తయారు చేయాలన్న భారత నౌకాదళ నిర్ణయంలో భాగంగా ఈనౌకను తయారు చేశారు. 2013లో  నౌక తయారీ పనులను ముంబైలో ప్రారంభించారు. ఈ యుద్ధనౌక క్షిపణులను తీసుకెళ్లడమే కాకుండా మిసైల్ డిస్ట్రాయర్ గా సేవలందించనుంది. ప్రస్తుతం ఇది విశాఖ కేంద్రంగా ఉన్న తూర్పు నావికాదళం పరిధిలో చేరింది. దీంతో పాటు నావికాదళాలకు చెందిన 60 యుద్ధ నౌకలు, జలాంతర్గాములు PFR లో పాల్గొన్నాయి.

మరిన్ని వార్తల కోసం

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇకలేరు

చావడానికైనా సిద్ధమే కానీ తలవంచను