మహిళా సాధికారతకు టాప్ ప్రయారిటీ

మహిళా సాధికారతకు టాప్ ప్రయారిటీ

సబ్ కా సాత్ సబ్ కా వికాస్ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల సందర్బంగా ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగించారు.   ప్రతి భారతీయుడికి స్వాతంత్య్ర అమృతోత్సవ్‌ శుభాకాంక్షలు తెలిపారు .దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరులకు నివాళులర్పించారు. దేశాభివృద్ధి ప్రయాణంలో దోహదపడిన వ్యక్తులను స్మరించుకుంటున్నామన్నారు. దేశ సురక్షిత భవిష్యత్‌ కోసం గతాన్ని గుర్తుతెచ్చుకోవడం ముఖ్యమన్నారు. వచ్చే 25 ఏళ్లపాటు పునాదులు పటిష్టంగా ఉండేలా ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు.  కరోనా పోరులో భారత్ పోరు స్ఫూర్తిదాయకమన్నారు. కరోనా సమయంలో  ప్రజలు ఆకలితో ఉండకుండా చూశామన్నారు. కరోనా సమయంలో  అందరూ ఒక టీంగా పనిచేశారన్నారు.

జల్ జీవన్ మిషన్ తో రూ.6కోట్ల గ్రామాలకు నీళ్లందించామన్నారు.   వ్యాక్సినేషన్ లో భారత్ రెండో స్థానంలో ఉందన్నారు.  దేశంలో ఏడాదిలో 150 కోట్ల డోసులకు పైగా కరోనా వ్యాక్సినేషన్ పూర్తయిందన్నారు. ఫార్మా ఇండస్ట్రీని విస్తరించేందుకు ప్రోత్సహిస్తున్నామన్నారు. కిసాన్ సమ్మాన్ నిధితో  రైతుల అకౌంట్లోకి డబ్బులు వచ్చాయన్నారు. మహిళా సాధికారతకు టాప్ ప్రయారిటీ ఇస్తున్నామన్నారు. గరీభ్ కళ్యాణ్ యోజనతో 2 కోట్ల పేద కుటుంబాలకు ఇళ్లు ఇచ్చామన్నారు. జన్ ధన్ యోజనతో పేదలకు బ్యాంకు అకౌంట్లు ఇచ్చామన్నారు. నూతన విద్యావిధానంతో ప్రాంతీయ భాషలకు ప్రాముఖ్యత ఇచ్చామన్నారు. భేటీ బచావో భేటీ పడావోతో మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.ఖేలో ఇండియా స్కీం ద్వారా క్రీడాకారులకు ప్రోత్సాహం ఇస్తున్నామన్నారు.