డిసెంబర్ 18న హైదరాబాద్​కు రాష్ట్రపతి ముర్ము.. శీతాకాల విడిది కోసం రాక

డిసెంబర్ 18న హైదరాబాద్​కు రాష్ట్రపతి ముర్ము.. శీతాకాల విడిది కోసం రాక

శామీర్ పేట, వెలుగు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం ఈ నెల 18 న హైదరాబాద్ రానున్నారు. ఈ నేప థ్యంలో మల్కాజ్​గిరి జిల్లాలోని అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, అధికారులు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ గౌతమ్ ఆదేశాలిచ్చారు. ఈ మేరకు మంగళ వారం కలెక్టరేట్​లో డీసీపీ శబరీష్ , అదనపు కలెక్టర్ విజయేంద్ర రెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్​పోర్టుకు చేరుకుంటారని, అక్కడ నుంచి బొల్లారంకు రోడ్డు మార్గాన వెళ్తారని అధికారులకు వివరించారు. అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం అవసరమైన జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలని, ప్రెసిడెంట్ హైదరాబాద్​ నుంచి తిరిగి వెళ్లేదాకా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సమీక్షలో అధికారులు హరిప్రియ, రాజేశ్ కుమార్, శ్యామ్ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.