రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ సర్వం సిద్ధం

రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ సర్వం సిద్ధం

రాష్ట్రపతి ఎన్నిక కౌంటింగ్కు సర్వం సిద్ధమైంది.  ఉదయం 11 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. పార్లమెంట్ భవనం రూమ్ నంబరు 63లో ఓట్ల లెక్కింపు జరగనుంది.  ఇవాళ‌ సాయంత్రం లోపు తుది ఫలితం వెలువడే అవకాశం ఉంది.  రాష్ట్రపతి ఎన్నికల రిటర్నింగ్ అధికారి పీసీ మోదీ ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు జరగనుంది. మొదటగా ఎంపీల ఓట్ల లెక్కింపు, అనంత‌రం రాష్ట్రాల వారీగా రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓట్ల లెక్కింపు జరుగుతుంది.  జూలై 18న జ‌రిగిన‌ రాష్ట్రపతి ఎన్నికల్లో 99.12 ఓటింగ్ శాతం నమోదయ్యింది.  రాష్ట్రపతి ఎన్నికలో 4,754 ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు.   జూలై 24తో ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ముగియ‌నుంది.  జూలై 25న నూతన రాష్ట్రపతి ప్ర‌మాణ స్వీకారం చేస్తారు