జనవరి నుంచి పెరగనున్న హోండా కార్ల ధరలు

జనవరి నుంచి పెరగనున్న హోండా కార్ల ధరలు

న్యూఢిల్లీ: హోండా కార్ల ధరలు వచ్చే నెల నుంచి పెరగనున్నాయి. ముడిసరుకుల ధరలు పెరిగాయని, అందుకే రేట్లు పెంచుతున్నామని హోండా కార్స్ ఇండియా ప్రకటించింది.  ఎలివేట్‌‌‌‌, సిటీ, అమేజ్‌‌‌‌ మోడల్స్‌‌‌‌ను ఇండియన్ మార్కెట్‌‌‌‌లో అమ్ముతోంది. ఒక్కో మోడల్ ధర ఎంత మేర పెరుగుతుందనేది ఈ నెల చివరిలో కన్ఫర్మ్‌‌‌‌ చేస్తామని  కంపెనీ  వైస్‌‌‌‌ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్‌‌‌‌) కునాల్ బెహ్ల్‌‌‌‌ అన్నారు.  

తాజాగా లాంచ్ చేసిన ఎలివేట్‌‌‌‌కు మంచి స్పందన వస్తోందని,  ప్రారంభ ధరలో  ఈ నెల 23 వరకు ఈ కారు అందుబాటులో  ఉంటుందని పేర్కొన్నారు. కాగా, మారుతి సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఆడి ఇండియా కూడా జనవరి నుంచి ధరలు పెంచుతామని ప్రకటించాయి.  కమొడిటీ రేట్లు పెరిగాయనే కారణం చెబుతున్నాయి. టాటా  మోటార్స్‌‌‌‌, మెర్సిడెజ్ బెంజ్ కూడా రేట్లు పెంచే ఆలోచనలో ఉన్నాయి.