
పెట్రోల్, డీజిల్ రేట్లు అంతకంతకూ పెరుగుతున్నాయి. వరుసగా ఏడో రోజు పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఇవాళ ఢిల్లీలో లీటరు పెట్రో ల్ పై 30 పైసలు, డీజిల్ పై 35 పైసలు పెరిగింది. దీంతో దేశ రాజధానిలో చమురు ధరలు ఆల్ టైం హైకి చేరాయి. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 104 రూపాయల 44 పైసలకు చేరగా, డీజిల్ ధర 93 రూపాయల 17పైసలుగా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ 110 రూపాయల 41 పైసలు, డీజిల్ 101 రూపాయల 3 పైసలకు చేరింది. ఇక హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 108 రూపయాల 64 పైసలు కాగా, డీజిల్ 101 రూపాయల 65పైసలకు చేరింది.