మా సభ్యత్వానికి నాగబాబు రాజీనామా

మా సభ్యత్వానికి  నాగబాబు రాజీనామా

గత కొన్ని నెలలుగా ప్రకాశ్​ రాజ్ ప్యానల్ ను సపోర్ట్ చేస్తూ వస్తున్న నటుడు నాగబాబు  ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ‘‘ప్రాంతీయ వాదం, సంకుచిత మనస్తత్వంతో కొట్టు-మిట్టాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో కొనసాగడం నాకు ఇష్టం లేక ‘మా’ అసోసియేషన్‌లో  నా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.. సెలవు’’ అని నాగబాబు ట్వీట్​ చేశారు.ఇది తాను ఎంతగానో ఆలోచించి ప్రలోభాలకు అతీతంగా తీసుకున్న నిర్ణయమన్నారు. 48 గంటల్లో తన రాజీనామా లేఖను మా కార్యాలయానికి పంపిస్తానన్నారు.