పార్లమెంట్ ఓపెనింగా.. మోడీకి పట్టాభిషేకమా

పార్లమెంట్ ఓపెనింగా.. మోడీకి పట్టాభిషేకమా

హుస్నాబాద్, వెలుగు: కొత్త పార్లమెంట్ ప్రారంభ కార్యక్రమం చూస్తుంటే ప్రధాని మోడీ పట్టాభిషేకం చేసుకున్నట్లుగా ఉందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి విమర్శించారు. మోడీ పాటించిన రాచరికపు ఆచారాలతో ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి అవమానం జరిగిందన్నారు. సోమవారం సాయంత్రం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో చాడ మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ కు అధిపతి అయిన రాష్ట్రపతిని ప్రారంభ కార్యక్రమానికి దూరంగా ఉంచడం పార్లమెంట్ రూల్స్​కు విరుద్ధమన్నారు. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిన లోక్‌సభ సెక్రటేరియట్‌పై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సీఎం కేసీఆర్​కేసీఆర్​నియంతలా వ్యవహరిస్తున్నారని, రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగానైనా గతంలో ఇచ్చిన హామీలను అమలుచేయాలని కోరారు. ఇండ్ల స్థలాలు, డబుల్​బెడ్​రూమ్​ఇండ్లు, నిరుద్యోగ భృతి, 57 ఏండ్లు నిండినవారందరికీ పెన్షన్లు ఇస్తామని మాట తప్పారన్నారు. జూన్ 4న కొత్తగూడెంలో సీపీఐ గర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో ఆ పార్టీ  జిల్లా కార్యదర్శి మంద పవన్, రాష్ట్ర సమితి సభ్యుడు గడిపె మల్లేశ్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎడల వనేశ్, జాగీరు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.