
ప్రధాన మంత్రి మణిపూర్ అల్లర్లు, నీట్ పరీక్ష పేపర్ లీకులపై లోక్ సభలో మాట్లాడాలని విపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. మోదీ ప్రసంగం మొదలైనప్పటి నుంచి దాదాపు గంటసేపుగా లోక్ సభ గందరగోళంగా ఉంది. ఉయ్ వాంట్ జస్టిస్ అంటూ ప్రతిపక్షాల ఎంపీలు నినాదాలు చేశారు. విపక్షాల తీరుపై ప్రధాని అసంతృప్తి వ్యక్తి చేశారు. ఎట్టకేలకు ప్రధాని పేపర్ లీకులపై స్పందించారు. నీట్ పేపర్ లీక్ అంశంపై మోదీ స్పందించడం ఇదే మొదటి సారి. యువత భవిష్యత్‌తో ఆడుకునే వారిని వదిలిపెట్టమని మోదీ హెచ్చరించారు. పేపర్ లీకేజ్ ఘటనపై విచారణ వేగవంతంగా జరుగుతుందని తెలిపారు.
ప్రతిపక్షాల నిరసనల మధ్యలోనే ప్రధాని ప్రసంగించారు. చిల్లర రాజకీయాలతో దేశం నడవదని మోదీ విపక్షలపై విరుచుకపడ్డారు. 13 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఒక్క ఎంపీ సీటు కూడా రాలేదన్నారు. సానుభూతి కోసం రాహుల్ గాంధీ చిన్న పిల్లాడి చేస్తున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన 99 సీట్లు 100కు కాదని.. 543 సీట్లకు అని మోదీ సెటర్లు వేశారు. దేశ ప్రజలంతా మా వైపే ఉన్నారని ఈ సారి కూడా మరింత వేగంగా పని చేస్తామని ప్రధాని చెప్పుకొచ్చారు.
గత పదేళ్లలో 4కోట్ల ఇండ్లు నిర్మించాం.. మరో ఐదేళ్లలో ఇంకా 3కోట్ల ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ పాలనలో మొత్తం స్కా్ములే జరిగాయని, కాంగ్రెస్ హాయంలో రక్షణ రంగంలో అనేక కుంభకోణాలు జరిగాయని ఎద్దేవా చేశారు. దేశప్రజలను తప్పు దోవపట్టించేదుకు కాంగ్రెస్ ప్రయాత్నిస్తుందని ప్రధాని మండిపడ్డారు. హిందువులను అవమానించడమే కొందరికి ఫ్యాషన్ గా మారిందని మోదీ లోక్ సభ ధన్యవాద తీర్మానంలో మాట్లాడారు.