
మే 3 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు చెప్పిన ప్రధాని మోడీ దేశ ప్రజలకు ఏడు కీలక సూచనలిచ్చారు.కరోనా విజృంభిస్తున్న సమయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని రేపు మరిన్ని గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తామన్నారు మోడీ.
మోడీ సూచనలు
- సీనియర్ సిటిజన్స్ జాగ్రత్తగా చూసుకోవాలి
- అత్యవసర విధుల్లో ఉన్నవారిని గౌరవిద్దాం
- పేదలకు ఆకలితో,ఆపదలో ఉన్నవారికి మరింత సాయం చేద్దాం
- ఏ ప్రైవేటు సంస్థ ఉద్యోగులపై వేటు వేయొద్దు
- రోగనిరోధక శక్తి పెంచుకోవాలి
- ఆరోగ్య సేతు ఆప్ ను డౌన్ లోడ్ చేసుకోండి..సురక్షితంగా ఉండండి
- భౌతిక దూరం పాటించాలి..కరోనాను తరిమేయాలి