పర్యావరణ పరిరక్షణ కోసమే స్వచ్ఛ భారత్

పర్యావరణ పరిరక్షణ కోసమే స్వచ్ఛ భారత్

న్యూఢిల్లీ: స్వఛ్చభారత్, నమో గంగా లాంటి పథకాలతో పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నామని ప్రధాని మోడీ అన్నారు. సేవ్ సాయిల్ ఉద్యమంలో భాగంగా మోడీ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సద్గురు జగ్గీ వాసుదేవ్ పాల్గొన్నారు. వాతావరణ మార్పుల్లో భారత్ పాత్ర అతి తక్కువున్నా.. పర్యావరణ పరిరక్షణకు భారత్ అనేక ప్రయత్నాలు చేస్తుందన్నారు. గతంలో రైతులకు సాయిల్ మేనేజ్మెంట్ పై అవగాహన లేదని.. దాన్ని అధిగమించేందుకు సాయిల్ హెల్త్ కార్డులివ్వాలని ప్రచారం చేశామన్నారు. భారత్ జీవ వైవిధ్య విధానాలే వన్యప్రాణుల సంఖ్య పెరిగేందుకు కారణమైందని చెప్పారు. సాయిల్ డీగ్రేడైజేషన్ వల్లే పర్యావరణం పాడవుతుందని తెలిపారు. ప్రకృతిని కాపాడేందుకు అందరూ సహకరిచాలని సద్గరు జగ్గీ వాసుదేవ్ అన్నారు. 

మరిన్ని వార్తల కోసం...

మైనర్ అత్యాచార ఘటనపై గవర్నర్ సీరియస్

పిలిచి ముఖం చాటేసిన మంత్రిపై సర్పంచ్‌‌ల ఆగ్రహం