PM MODI: అల్లు కనకరత్నమ్మ మృతిపై సంతాపం తెలిపిన ప్రధాని మోడీ

PM MODI: అల్లు కనకరత్నమ్మ మృతిపై సంతాపం తెలిపిన ప్రధాని మోడీ

Modi On Allu Kanakaratnamma: టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ తల్లి, అల్లు అర్జున్ నానమ్మ  అల్లు కనకరత్నమ్మ (94) కన్నుమూసిన విషయం తెలిసిందే. వృద్ధాప్య కారణాలతో శనివారం (ఆగస్టు 30న) తెల్లవారుజామున ఆమె తుది శ్వాస విడిచారు.

ఈ విషాదంలో ఉన్న‘అల్లు’ కుటుంబ సభ్యులను భారత ప్రధాని నరేంద్ర మోడీ తన సానుభూతి తెలిపారు. ఈ క్రమంలో అల్లు కనకరత్నమ్మ మరణం పట్ల తన హృదయపూర్వక సంతాపాన్ని వ్యక్తం చేశారు ప్రధాని మోడీ. ఈ విషయాన్ని పీఎంఓ ఇండియా 'X' వేదికగా అధికారిక ప్రకటనలో వెల్లడించింది. 

ఈ క్రమంలో నిర్మాత అల్లు అరవింద్ ‘ప్రధానమంత్రి గారి కరుణా సందేశం మరియు ఆశీర్వాదాలకు ఎల్లప్పుడూ కృతజ్ఞులమై’ ఉంటామని తెలిపారు. " మా అమ్మ శ్రీమతి అల్లు కనకరత్నమ్మ గారి జ్ఞాపకాలను ఇంత ఆప్యాయంగా, గౌరవంగా గౌరవించినందుకు గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి మేము ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉంటాము. ఆయన సందేశం మమ్మల్ని ఎంతగానో కదిలించింది" అని సోషల్ మీడియా వేదికగా అల్లు అరవింద్ కృతజతలు తెలిపారు. ఇపుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.