అయూబ్ కుటుంబం కష్టం విని భావోద్వేగానికి గురైన ప్రధాని

అయూబ్ కుటుంబం కష్టం విని భావోద్వేగానికి గురైన ప్రధాని

ఢిల్లీ : గుజరాత్ లోని బరూచ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో లబ్ధిదారులతో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. అయూబ్ పటేల్ అనే వ్యక్తి తన కుటుంబం గురించి, తమకు అందుతున్న ప్రభుత్వ పథకాల గురించి మోడీకి వివరించారు. ఈ సందర్భంగా అయూబ్ చెప్పిన విషయాలను విని ప్రధాని చలించిపోయి..కాసేపు అలా మౌనంగా ఉండిపోయారు. తన ముగ్గురు కూతుళ్లు చదువుకుంటున్నారని, అందులో ఇద్దరికి ప్రభుత్వ స్కాలర్ షిప్ వస్తుందని అయూబ్ పటేల్ చెప్పాడు. తన పెద్ద కుమార్తె 12వ తరగతి చదువుతోందని, భవిష్యత్తులో డాక్టర్ కావాలనుకుంటోందని చెప్పాడు. ‘ఎందుకు డాక్టర్ కావాలని అనుకుంటున్నావు’ అని అక్కడే ఉన్న అయూబ్ కూతుర్ని ప్రధాని ప్రశ్నించారు. ఆ సమయంలో ఆ అమ్మాయి చెప్పిన మాటలు విని ప్రధాని కాసేపు అలా మౌనంగా ఉండిపోయారు. 

‘అందుకు మా నాన్న అనుభవిస్తున్న సమస్యే కారణం’ అంటూ కన్నీటి పర్యంతమైంది. సౌదీ అరేబియాలో పని చేస్తున్న సమయంలో కంట్లో వేసుకున్న చుక్కుల మందు అయూబ్ కంటి చూపు పోయేలా చేసింది. దాంతో అందరిలా ఆయన సరిగా చూడలేరు. అయూబ్ కుమార్తె చెప్పిన కారణం విన్న ప్రధాని భావోద్వేగానికి లోనై.. కాసేపు అలా మౌనంగా ఉండిపోయారు. ఆ వెంటనే తేరుకుని ‘ఇతరుల పట్ల నువ్వు చూపుతున్న కరుణే నీ బలం’ అంటూ ఆమెను అభినందించారు. అయూబ్ కూతురు చదువుకు సాయం చేయడానికి సిద్ధంగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆ తర్వాత అయూబ్ పటేల్ కుటుంబ సభ్యులు రంజాన్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా అడిగి తెలుసుకున్నారు ప్రధాని మోడీ. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

మరిన్ని వార్తల కోసం..

రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు నోటిఫికేషన్

ఈ సారి స్టూడెంట్లకు యూనిఫామ్స్ అందుడు కష్టమే