ఉమెన్స్ వరల్డ్ కప్ విజేతలకు రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు

ఉమెన్స్ వరల్డ్ కప్ విజేతలకు రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు

 అండర్ 19 ఉమెన్స్ టీ 20 వరల్డ్ కప్ క్రికెట్ లో క్రీడాకారిణుల విజయం దేశం గర్వించేలా చేసిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్వీట్ చేశారు. అండర్ 19 మహిళల T20 ప్రపంచ కప్‌ను గెలుచుకున్నందుకు టీమ్ ఇండియాకు అభినందనలు తెలిపారు. ఈ ప్రతిభావంతులైన యువతులు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారని ప్రశంసించారు. ఈ ఛాంపియన్‌లు యువతకు, ముఖ్యంగా అమ్మాయిలకు స్ఫూర్తి అని కొనియాడారు. వీరు సాధించిన చారిత్రాత్మక విజయం భారతదేశం గర్వించేలా చేసిందని ట్వీట్ లో పేర్కొన్నారు.

 

అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ విజేతగా భారత్ నిలవడంపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. భారత జట్టుకు ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ప్లేయర్లంతా ఆట బాగా ఆడారని కొనియాడారు. వారి విజయం భావి క్రికెటర్లకు మరింత స్ఫూర్తినిస్తుందని ప్రధాని చెప్పారు. భవిష్యత్ లో వారు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.