Prime Videos: ప్రైమ్ వీడియో నుండి అతిపెద్ద స్లేట్‌.. రెండేళ్ల కమిట్మెంట్ ప్రకటన.. లిస్టులో 70 సినిమాలు/సిరీసులు

Prime Videos: ప్రైమ్ వీడియో నుండి అతిపెద్ద స్లేట్‌.. రెండేళ్ల కమిట్మెంట్ ప్రకటన.. లిస్టులో 70 సినిమాలు/సిరీసులు

ప్రస్తుతం ఇండియా వైడ్ గా ఉన్న టాప్ ఎంటర్టైనింగ్ ప్లేట్ ఫారం ఏదైనా ఉందంటే అది ప్రైమ్ వీడియో(Prime Video) అనే చెప్పాలి. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ ను ప్రేక్షకులకు అందిస్తూ టాప్ రేటింగ్ తో దూసుకుపోతోంది ప్రైమ్ వీడియో. తాజాగా ఈ సంస్థ ప్రైమ్ వీడియో ప్రెజెంట్స్ ఇండియా షోకేస్‌ పేరుతో ఓ ఈవెంట్ ను నిర్వహించింది. ఈ ఈవెంట్ లో భాగంగా రానున్న రెండు సంవత్సరాలకు గాను తమ కమిట్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్ ను ప్రకటించింది. అందులో దాదాపు 70 వెబ్ సిరీస్‌లు, సినిమాలు ఉన్నాయి. ఆ లిస్టులో 40 ఒరిజినల్ సిరీస్‌లు, 29 సినిమాలున్నాయి. ఒకేసారి ఇంత భారీ రేంజ్ లో కొత్త కంటెంట్ ను అనౌన్స్ చేసి కొత్త స్లేట్ కస్టమర్‌లను ఆకర్షించే ప్రయత్నాలు చేసింది ప్రైమ్ వీడియోస్. హిందీ, తమిళం, తెలుగు భాషతో సంబంధం లేకుండా అనేక రకాలైన సిరీస్‌లు, సినిమాలు, ఉత్కంఠభరితమైన థ్రిల్లర్‌లు, ఆకట్టుకునే డ్రామాల ఆడియన్స్ ముందుకు తీసుకురానుంది. 

 
ఈ కార్యక్రమంలో ఇండియాస్ ప్రైమ్ వీడియో డైరెక్టర్ మాట్లాడుతూ.. ప్రైమ్ వీడియోలో అత్యుత్తమ వినోదాన్ని భారతీయ వినియోగదారులకు అందించడంపై దృష్టి పెట్టాము. ఒరిజినల్ సిరీస్‌, సినిమాలు, పోస్ట్ థియేట్రికల్ లాంచ్‌ల వరకు ప్రతి కస్టమర్‌ వినోదాన్ని అందించడమే మా లక్ష్యం. 2023లో మా సంస్థ కొత్త పుంతలు తొక్కింది. కొత్త కస్టమర్స్, ప్రైమ్ మెంబర్ ఎంగేజ్‌మెంట్‌ వంటి వాటిలో భారతదేశం ముందు ఉంది. ఇందులో భాగంగా మా కస్టమర్‌ల నుండి మాకు లభించిన ప్రేమకు మేము ఎప్పుడు కృతజ్ఞులమే.అంటూ చెప్పుకొచ్చారు.  
 
అనంతరం భారత్ ఆసియన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్స్ హెడ్, అపర్ణ పురోహిత్ మాట్లాడుతూ.. ప్రైమ్ వీడియోలో భారతీయ కథలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకురావడమే లక్ష్యం. 2023లో మా కంటెంట్ ప్రతీవారం 210కి పైగా దేశాల్లో వీక్షించబడింది. అంతేకాదు గత 52 వారాలుగా 43 దేశాల్లో ప్రైమ్ వీడియోలో టాప్ 10లో ట్రెండ్ చేయబడింది. ఇవన్నీ చూస్తున్నపుడు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కొత్త కొత్త కంటెంట్ ను ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి మాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ప్రైమ్ వీడియో నుండి రాబోయే సిరీస్ లు, సినిమాలు మరింత ఆకట్టుకునేలా ఉండటానికి మార్గం సుగమం చేస్తాయని నమ్ముతున్నాము.. అంటూ చెప్పుకొచ్చారు.