ఖైదీలతో శృంగారం.. మహిళా అధికారికి జైలు

ఖైదీలతో శృంగారం.. మహిళా అధికారికి జైలు

కాలిఫోర్నియా: ఖైదీల్లో మార్పు తీసుకొచ్చి వారిని సత్ప్రవర్తనతో మెలిగేలా చేయాల్సిన అధికారే నిబంధనలు గాలికి వదిలేసింది. ఏకంగా ఖైదీలతో బహిరంగ శృంగారంలో పాల్గొంది. ఈ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగింది. ఫ్రెన్సో కంట్రీ జైలులో పని చేస్తున్న టినా గోంజాలెజ్ (26) అనే అధికారి ఖైదీలతో బహిరంగ సెక్స్‌లో పాల్గొంది. ఖైదీలతో టినా తనకు నచ్చిన సమయంలో విచ్చలవిడిగా శృంగారంలో పాల్గొంది. ఓసారి అయితే ఏకంగా 11 మంది ఖైదీలు చూస్తుండగా.. ఒక ఖైదీతో సెక్స్‌లో పాల్గొంది. ఆ టైమ్‌లో సెక్స్ చేసేందుకు అడ్డుగా ఉందని యూనిఫామ్‌ను చించేసింది.

ఖైదీలకు టినా ఫోన్‌లు సరఫరా చేసేదని.. సోదాల సమయంలో ముందస్తుగా హెచ్చరించేదని ఒక జైలు అధికారి కోర్టుకు తెలిపారు. గతంలో ఇలా ఎంతోమందితో శృంగారంలో పాల్గొన్నాననే విషయాలను ఫోన్లలో ఖైదీలతో గొప్పగా చెప్పుకొనేదని ఆ అధికారి చెప్పారు. విచారణ సందర్భంగా ఇవన్నీ విన్న న్యాయమూర్తి షాక్‌కు గురయ్యారు. ఇది సరైన ప్రవర్తన కాదని, కెరీర్‌ను నాశనం చేసుకున్నావంటూ టినాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆమెకు మూడేళ్ల ఎనిమిది నెలల జైలు శిక్ష విధించారు. అయితే టినాకు గతంలో నేర చరిత్ర లేకపోవడంతో రెండేళ్ల ప్రొబేషన్, ఏడు నెలలకు శిక్షను కుదించారు.