
హైదరాబాద్: కమర్షియల్ మూవీస్‌లోనూ కొత్త తరహా కాన్సెప్ట్స్ ఎంచుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్నాడు మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్. హీరోగానే కాక దర్శకుడిగా కూడా బిజీగా ఉంటూనే.. అప్పుడప్పుడు ఇతర భాషల్లోనూ నటిస్తున్నాడు. త్వరలో ప్రభాస్ సినిమాలోనూ కనిపించబోతున్నాడు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ‘సాలార్’ చిత్రంలో పృథ్వీరాజ్ నటిస్తున్న విషయాన్ని ‘రాధేశ్యామ్’ మలయాళ వెర్షన్ ప్రెస్‌మీట్‌లో కన్‌ఫర్మ్ చేశాడు ప్రభాస్. ఇందులో పృథ్వీరాజ్ విలన్‌గా నటిస్తున్నాడు. హీరోగా చేస్తూనే నెగిటివ్ షేడ్స్ ఉండే ఎన్నో పాత్రల్లో ఇప్పటికే నటించాడు. తెలుగు సినిమా కూడా తనకు కొత్తేమీ కాదు. పన్నెండేళ్ల క్రితం ‘పోలీస్ పోలీస్’ అనే చిత్రంలో నెగిటివ్ రోల్ చేశాడు. మళ్లీ ఇన్నేళ్లకు ‘సాలార్’తో టాలీవుడ్‌కు వస్తున్నాడు. అంతే కాదు.. ‘రాధేశ్యామ్’కు తెలుగులో రాజమౌళి, హిందీలో అమితాబ్ ఇచ్చినట్టు మలయాళంలో పృథ్వీరాజ్ వాయిస్ ఇచ్చాడు.