
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చుట్టూ ప్రైవేటు బౌన్సర్లు వచ్చేశారు. సీఎం పదవి కోల్పోవడంతో ప్రభుత్వం సెక్యూరిటీని తగ్గించింది. ఇవాళ నందినగర్ లోని నివాసం నుంచి బౌన్సర్ల రక్షణలో ఆయన పార్టీ కార్యాలయమైన తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. లారీలో జనరేటర్ ను తీసుకొచ్చి తెలంగాణ భవన్ బయట నిలుపడం గమనార్హం. రాష్ట్రంలో కరెంటు కోతలు ఉన్నాయని ప్రజలకు, మీడియాకు చెప్పేందుకే జనరేటర్ తెచ్చి షో చేస్తున్నారనే టాక్ వినిపించింది.