నిజామాబాద్ జిల్లాలో రూల్స్​ పాటించని ప్రైవేట్​ దవాఖానలు

నిజామాబాద్ జిల్లాలో రూల్స్​ పాటించని  ప్రైవేట్​ దవాఖానలు
  • ఎన్​వోసీ లేకున్నా  యథేచ్ఛగా నిర్వహణ
  • నామ్​కే వాస్తే నోటీసులు ఇస్తున్న ఆఫీసర్లు
  • కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్​

నిజామాబాద్,  వెలుగు:  ఇటీవల హైదరాబాద్​లో జరిగిన ఫైర్​ యాక్సిడెంట్ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని  ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఫైర్ సెఫ్టీ పై ఆందో ళన వ్యక్తమవుతోంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లో పలు ఆస్పత్రులు కనీస నిబంధనలు పాటించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. చాలా హాస్పిటళ్లలో ఫైర్​ సేఫ్టీ పరికరాలు, వాటర్​ఫెసిలిటీ కూడా లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. సెఫ్టీ రూల్స్ చెక్​ చేసి చర్యలు తీసుకోవాల్సిన ఆఫీసర్లు నామ్​కే వాస్తే తనిఖీలు, నోటీసు లిచ్చి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.  వచ్చే నెల ఎండాకాలం ప్రారంభం కానుండడం, అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో అగ్నిమాపక శాఖ ఆఫీసర్లు అలర్ట్​గా ఉండాలని జిల్లా వాసులు డిమాండ్​ చేస్తున్నారు.  

యాజమాన్యాల ఇష్టారాజ్యం

ఉమ్మడి జిల్లాలో సుమారు 500  ప్రైవేట్​ఆస్పత్రులు ఉన్నాయి. ఇందులో 145 హాస్పిటల్స్​వరకు  నిజామాబాద్‌‌‌‌లోని ఖలీల్‌‌‌‌వాడిలోనే ఉన్నాయి.   హాస్పిటల్​ బిల్డింగ్స్​ ఫైర్​సేఫ్టీ రూల్స్​పాటిస్తూ నిర్మించాల్సి ఉండగా, యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు.  చాలా ఆస్పత్రులు నివాస భవనాల్లో నడుపుతుండడంతో  ఫైర్​ సేఫ్టీ ఏర్పాట్లు చేయలేదు.  జిల్లా వ్యాప్తంగా కేవలం 10 ఆస్పత్రులకు మాత్రమే  అగ్నిమాపకశాఖ నుంచి నో ఆబ్జెక్షన్​సర్టిఫికెట్​కలిగి ఉన్నాయంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థమవుతోంది.  ముఖ్యంగా ఖలీల్‌‌‌‌వాడి హాస్పిటల్స్ హబ్ గా  మారింది. కానీ ఇక్కడ ఏ ఒక్క భవనానికి కూడా ఫైర్​సేఫ్టీ ఎన్వోసీ  లేదు. కొన్ని ఆస్పత్రి యాజమాన్యాలు ఆరోగ్యశ్రీ  పర్మిషన్ల కోసమే యాంటీ ఫైర్​పరికరాలు  ఏర్పాటు చేసుకున్నారు.  రెండు   బిల్డింగ్స్​మధ్య  కనీసం 6 మీటర్ల ఖాళీ స్థలం ఉండాలి.  ఒక భవనంలో ఫైర్​యాక్సిడెంట్​జరిగినా ఇంకో దానిలోకి వ్యాపించకుండా ఉంటుంది. కానీ ఏ ఒక్క భవనం కూడా ఈ రూల్స్​పాటించడం లేదు. ఆస్పత్రుల వద్దకు అగ్నిమాపక వాహనం వెళ్లే పరిస్థితి లేదు.  కొన్నింటికి  మెట్లు మాత్రమే ఉన్నాయి. ఎమర్జెన్సీ ద్వారాలు,  స్టేర్​కేస్​సౌకర్యాలు లేవు. చాలా ఆస్పత్రుల్లో విద్యుత్​వ్యవస్థ  కూడా అంతంత మాత్రంగానే  ఉంది. గతంలో పలు ఆస్పత్రులలో  షార్ట్​సర్క్యూట్​జరిగి అగ్నిప్రమాదాలు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి.  

నోటీసులిచ్చినా స్పందన కరువు..

15 మీటర్ల ఎత్తుకు పైగా ఉన్న ఆస్పత్రి బిల్డింగ్స్​కు ఎన్‌‌‌‌వోసీ తప్పనిసరి. జిల్లాలో ఇలాంటి ఆస్పత్రి భవనాలు 50  వరకు ఉన్నాయి. కానీ  వీరెవరూ ఎన్‌‌‌‌వోసీ తీసుకోలేదని తెలుస్తోంది. కనీసం యాంటీ ఫైర్​పరికరాలైనా ఏర్పాట్లు చేయడం లేదు. ఇటీవల నిజామాబాద్‌‌‌‌లోని కొన్ని  ఆస్పత్రులకు అగ్నిమాపకశాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. కానీ యాజమాన్యాల నుంచి ఎలాంటి స్పందన రాలేదు.  ఇప్పటికైనా   ఆఫీసర్లు    కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు డిమాండ్​ చేస్తున్నారు.  

ఫైర్​ సేఫ్టీ లేకున్నా చర్యల్లేవ్​

జిల్లాలో  ఏ ఒక్క  ప్రైవేట్​ఆస్పత్రి కూడా ఫైర్​సెఫ్టీ రూల్స్​ పాటించడం లేదు. చర్యలు తీసుకోవాల్సిన ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆస్పత్రుల బిల్డింగ్స్​కు సెట్​బ్యాక్​కూడా ఉండడం లేదు.  ఎన్​వోసీ లేకున్నా యథేచ్ఛగా రన్​చేస్తున్నారు.  సంబంధిత శాఖల ఆఫీసర్లు వెంటనే చర్యలు తీసుకోవాలి.

- కేశ వేణు,  కాంగ్రెస్​ అర్బన్​ ప్రెసిడెంట్​ 

కఠిన చర్యలు తీసుకుంటాం

ఫైర్​సెఫ్టీ రూల్స్​పాటించకపోతే హాస్పిటళ్లను సీజ్​చేస్తాం.  ఎన్​వోసీ లేని ఆస్పత్రులకు నోటీసులిచ్చాం. 15 మీటర్ల కు పైగా ఎత్తు ఉన్న ఆస్పత్రులు తప్పని సరిగా ఎన్‌‌వోసీ కలిగి ఉండాలి. సేఫ్టీ రూల్స్ పై తరచూ తనిఖీలు చేపడ్తున్నం.  మున్సిపల్​ శాఖ బిల్డింగ్స్​నిర్మాణప్పుడే అక్రమ కట్టడాలను నిరోధించాలి. 

- మురళీ మనోహర్​రెడ్డి, 
డివిజనల్​ ఫైర్​ ఆఫీసర్​