రన్‌వే పై జారిపడ్డ విమానం.. ముగ్గురికి గాయాలు

రన్‌వే పై జారిపడ్డ విమానం.. ముగ్గురికి గాయాలు

8 మంది ప్రయాణికులతో వెళ్తున్న బొంబార్డియర్ లియర్‌జెట్ ప్రైవేట్ జెట్ ముంబై విమానాశ్రయంలో రన్‌వే నుండి జారిపడి కుప్పకూలింది. సాయంత్రం 5.04 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఈ సమయంలో విమానంలో ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు.

వైజాగ్-ముంబై  VSR ఏవియేషన్ లీర్‌జెట్ 45 విమానం VT-DBL నగరంలో భారీ వర్షాల కారణంగా ల్యాండ్ అయిన తర్వాత టాక్సీ వే విస్కీ వద్ద రన్‌వే నుంచి జారిపడింది. ప్రస్తుతం రన్ వేను క్లియర్ చేసేందుకు అధికారులు ప్రయత్నలు చేస్తున్నారు. తదుపరి నోటీసు వచ్చే వరకు విమానాశ్రయం అన్ని కార్యకలాపాలను నిలిపివేయనుంది.

Also Read :- మనిషివేనా రా నువ్వు

విమానం కూలిపోవడంతో లోపల మంటలు చెలరేగాయి కానీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. వీఐపీలు కూడా ఎవరూ విమానంలో లేరు. కానీ గాయపడిన ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. "VSR వెంచర్స్ లీర్‌జెట్ 45 ఎయిర్‌క్రాఫ్ట్ VT-DBL విశాఖపట్నం నుంచి ముంబైకి ఆపరేటింగ్ ఫ్లైట్ ముంబై విమానాశ్రయంలో రన్‌వే 27లో ల్యాండ్ అవుతుండగా రన్‌వే పై ఈ సంఘటన జరిగింది" అని విమానాశ్రయం తెలిపింది.