కేంద్రానికి ప్రైవేట్ ఆయిల్ రిటైలర్ల లేఖ

కేంద్రానికి ప్రైవేట్ ఆయిల్ రిటైలర్ల లేఖ

పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రానికి ప్రైవేట్ రిటైల్ ఆయిల్ కంపెనీస్ లేఖ రాశాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరిగినా దేశీయంగా చమురు ధరలు సవరించలేదని..దీంతో లీటర్ డీజిల్ కు రూ.20-25, లీటర్ పెట్రోల్ పై 14-18 రూపాయలు నష్టపోతున్నామని వాపోయాయి. ఇలాగైతే వ్యాపారాలు నడపలేమని..వెంటనే కేంద్రం జోక్యం చేసుకుని ఊరట కల్పించాలని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పెట్రోలియం ఇండస్ట్రీ (ఫిపీ)  కేంద్రానికి లేఖ రాసింది.  

కాగా గత కొద్ది రోజులుగా అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరిగాయి. అయితే మార్చిలో వరుసగా 14 రోజుల పాటు వీటి ధరలను పెంచిన ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఆ తర్వాత సవరించడం మానేశాయి. దీని వల్ల తాము నష్టపోతున్నామని ఫిపీ తెలిపింది. కేంద్రం వెంటనే కల్పించుకోవాలని..లేకపోతే భవిష్యత్ లో తమ వ్యాపార విస్తరణపై ప్రభావం పడుతుందని ఫిపీ లేఖలో పేర్కొంది.