ప్రియదర్శి డార్లింగ్ సినిమా ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంచ్

ప్రియదర్శి డార్లింగ్  సినిమా ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంచ్

ప్రియదర్శి, నభా నటేష్ జంటగా  అశ్విన్ రామ్ రూపొందిస్తున్న చిత్రం ‘డార్లింగ్’. వై దిస్ కొలవెరి అనేది ట్యాగ్‌‌‌‌‌‌‌‌లైన్. కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా జులై 19న విడుదలవుతోంది. ఆదివారం ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంచ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌ను నిర్వహించారు. అతిథిగా హాజరైన హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ ‘ట్రైలర్ చాలా ప్రామిసింగ్‌‌‌‌‌‌‌‌గా ఉంది. హిలేరియస్‌‌‌‌‌‌‌‌గా అనిపించింది. దర్శి, నభా ఈ సినిమాతో సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నా’ అని టీమ్‌‌‌‌‌‌‌‌ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పాడు.  ప్రియదర్శి మాట్లాడుతూ ‘డార్లింగ్ అనగానే ప్రభాస్ అన్న పేరు గుర్తొస్తుంది.  

అలాంటి టైటిల్ పెట్టుకోవాలన్నా భయం భయంగా ఉంటుంది. అయితే కథని నమ్మి దానికి ఈ టైటిల్ అనుకున్నాం. నభా ఎక్స్‌‌‌‌‌‌‌‌ట్రార్డినరీగా యాక్ట్ చేసింది. సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అని అన్నాడు. ‘ఇది నాకు చాలా స్పెషల్ మూవీ.  యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత నటించిన సినిమా ఇది. అశ్విన్ నా క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అద్భుతంగా రాశాడు. ఆడియెన్స్ కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు’ అని నభా నటేష్ చెప్పింది.  

డైరెక్టర్ అశ్విన్ రామ్ మాట్లాడుతూ ‘ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చూసినట్లుగా ఇదొక ఫన్ రైడ్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్.  చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది’ అని అన్నాడు. నిర్మాత చైతన్య మాట్లాడుతూ ‘అశ్విన్ కథ చెప్పినప్పుడు నిరంజన్, నేను బాగా కనెక్ట్ అయ్యాం. ప్రతి ఒక్కరూ రిలేట్ చేసుకునేలా సినిమా ఉంటుంది’ అని చెప్పారు. టీమ్ అంతా పాల్గొన్నారు.