
ప్రియదర్శి హీరోగా విజయేందర్ తెరకెక్కించిన చిత్రం ‘మిత్ర మండలి’. బన్నీ వాస్ సమర్పణలో కళ్యాణ్ మంతెన, భాను ప్రతాప, డా. విజేందర్ రెడ్డి తీగల నిర్మించారు. ఇవాళ గురువారం (OCT16న) మూవీ థియేటర్లోకి వచ్చింది. ఈ సినిమాకు మిక్సెడ్ రివ్యూలు వస్తున్నాయి.
ఈ సినిమా కథ సింపుల్గా చెప్పాలంటే.. ‘‘ఓ నలుగురు కుర్రాళ్లు, వారి మధ్య ఓ అమ్మాయి.. కుల పిచ్చి ఉన్న అమ్మాయి తండ్రి. ఇలా వీరి మధ్య నడిచే పాలిటికల్ కామెడీ డ్రామా’’. నవ్వించడమే ప్రయత్నంగా చేసుకుని, ఈ మూవీ ఆడియన్స్ ముందుకొచ్చింది. వీకెండ్ గడిచేకొద్దీ సినిమా టాక్ మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రియదర్శితో పాటుగా సత్య, విష్ణు ఓయి, విటివి గణేష్, వెన్నెల కిషోర్ ఇలా చాలామంది కమెడియన్‌లు చేసే పంచ్‌లు, ప్రాసలు నవ్వించేలా ఉన్నాయి. ఫ్రెండ్స్తో వీకెండ్ సరదాగా ఎంజాయ్ చేసేయొచ్చు.
ఈ క్రమంలో మూవీ రిలీజ్ సందర్భంగా ప్రియదర్శి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘‘స్క్రిప్ట్ విన్నప్పుడే ఫుల్ ఎంజాయ్ చేసిన సబ్జెక్ట్ ఇది. ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా అనిపించడం వల్లే ఓకే చెప్పాను. విన్నప్పుడు ఎలా అనిపించిందో తెరపైకి కూడా అంతే బాగా వచ్చింది కనుకే ఇంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. ఓ ఫిక్షనల్ క్యాస్ట్ పేరు పెట్టి చాలా సెటైరికల్‌గా తీశాం. అలాగని ఏ ఒక్క కులం మీదనో సెటైర్ వేస్తున్నట్టు ఉండదు. ఒకవేళ ‘మమ్మల్నే అంటున్నారు’ అనిపిస్తే మేమేం చేయలేం (నవ్వుతూ).
ఎవ్వరి మనోభావాల్ని దెబ్బ తీయకుండా అందరినీ నవ్వించేలా ఉంటుంది. అంతేతప్ప ఇదేమీ సందేశాత్మక చిత్రం కాదు.. సినిమాల్లో ఇచ్చే సందేశాల వల్ల సమాజం మారుతుందని నేను నమ్మను.
►ALSO READ | DeepikaPadukone: హీరోయిన్ దీపికా పదుకొణెతో ఎప్పుడైనా మాట్లాడొచ్చు, చాట్ చేయొచ్చు: అది ఎలానో తెలుసా?
ఇక ‘జాతి రత్నాలు’కు ఈ సినిమాకు సంబంధం లేదు. అదే తరహా కథతో వస్తే, నేను వద్దన్న సందర్భాలు చాలానే ఉన్నాయి. నాకెప్పుడూ ఒకే రకమైన జానర్ సినిమాలు చేయడం ఇష్టం ఉండదు. అందుకే 35 చిన్న కథ కాదు, కోర్ట్ వంటి డిఫరెంట్ సినిమాలు చేశా.
ఇటీవల కొందరు నిర్మాణాత్మక విమర్శలు చేయడం కాకుండా కావాలనే ద్వేషాన్ని ప్రదర్శిస్తున్నారు. కించ పరచాలని, కిందకు తొక్కాలని టార్గెటెడ్‌గా హేట్‌ను వ్యాప్తి చేస్తున్నారు. ఫేక్ ఐడీలతో ఇలాంటి టార్గెటెడ్ హేట్రెడ్‌ని స్ప్రెడ్ చేస్తున్నారు. ఇక అవతలి వాళ్లని నవ్వించే ప్రయత్నం చేయడం తప్పు కాదు. కానీ వేరే వాళ్లని తక్కువ చేసి అదే కామెడీ అనడం నా దృష్టిలో క్రింజ్ అవుతుంది.
కొన్ని సార్లు వాదనలు గెలవలేనప్పుడు, అవతలి వారిని ఏమీ చేయలేక పోయినప్పుడు అలాంటి నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు. ఇక ప్రస్తుతం ‘ప్రేమంటే’ అనే సినిమా చేస్తున్నా. మరో రెండు కథలు నాకెంతో నచ్చాయి. త్వరలోనే వాటి అనౌన్స్‌మెంట్స్ ఉంటాయి’’ అని ప్రియదర్శి చెప్పుకొచ్చారు.