సుకుమార్, బన్నీ వాస్‌‌ కాంబోలో.. ప్రియదర్శి మూవీ 

సుకుమార్, బన్నీ వాస్‌‌ కాంబోలో.. ప్రియదర్శి మూవీ 

‘సేవ్‌‌ ది టైగర్స్‌‌ 3’ వెబ్‌‌ సిరీస్‌‌తో త్వరలో ఓటీటీ ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు ప్రియదర్శి. క్యారెక్టర్‌‌‌‌ ఆర్టిస్ట్‌‌గానే కాక లీడ్‌‌ రోల్‌‌లోనూ వరుస ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. తను హీరోగా నటించబోయే కొత్త చిత్రాన్ని శుక్రవారం అనౌన్స్ చేశారు.  ఓవైపు దర్శకుడిగా మెప్పిస్తూనే సుకుమార్ రైటింగ్స్‌‌ బ్యానర్‌‌‌‌పై వరుస చిత్రాలను నిర్మిస్తున్న   డైరెక్టర్‌‌‌‌ సుకుమార్.. ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 

అలాగే బన్నీ వాస్ వర్క్స్ పేరుతో కొత్త బ్యానర్‌‌‌‌ స్టార్ట్‌‌ చేసిన బన్నీ వాస్‌‌ కూడా ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించబోతున్నారు.  ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు... ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.