అనుపమ ఘుమఘుమలు

అనుపమ ఘుమఘుమలు

 ఏడాదిన్నర క్రితం  ‘భామా కలాపం’ అనే వెబ్‌‌‌‌ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చి అందర్నీ ఆకట్టుకుంది ప్రియమణి.  ‘డియర్‌‌‌‌‌‌‌‌ కామ్రెడ్‌‌‌‌’ ఫేమ్ భరత్‌‌‌‌ కమ్మ సమర్పణలో అభిమన్యు డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఆహాలో విడుదలై  మంచి రెస్పాన్స్‌‌‌‌ను తెచ్చుకుంది. తాజాగా సెకండ్ పార్ట్‌‌‌‌ను రూపొందించారు. ఫిబ్రవరి 16 నుంచి ఇది ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.   తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు.  యూట్యూబ్ ఛానల్‌‌‌‌లో వంటల కార్యక్రమాన్ని నిర్వహించే  మహిళగా అనుపమ పాత్రలో  ప్రియమణి కనిపిస్తున్న ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది.   బాపినీడు, సుధీర్ ఈదర నిర్మించిన ఈ చిత్రంలో శరణ్య ప్రదీప్,  సీరత్ కపూర్, రఘు  ముఖర్జీ, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషించారు.