ఎన్టీఆర్కు తల్లిగా ప్రియమణి.. షాకవుతున్న ఫ్యాన్స్

ఎన్టీఆర్కు తల్లిగా ప్రియమణి.. షాకవుతున్న ఫ్యాన్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్(Ntr) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ దేవర(Devara). స్టార్ డైరెక్టర్ కొరటాల శివ(Koratala shiva) తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా కోసం తారక్ ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. దీంతో ఈ సినిమా నుండి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన పోస్టర్స్ సినిమాపై అంచనాలు పెంచేయగా.. తాజాగా మరో న్యూస్ ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతోందో. 

అదేంటంటే.. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు అమ్మగా హీరోయిన్ ప్రియమణి చేస్తున్నారట. అవును.. ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. తండ్రి పాత్రకు జోడిగా ప్రియమణిని తీసుకున్నారని సమాచారం. అలా చిన్నప్పటి ఎన్టీఆర్ కు అమ్మగా ప్రియమణి ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ మొదట అవాక్కైనా.. తరువాత అర్థం చేసుకున్నారు. 

Also Read :- మళ్ళీ పూజాకే జై కొట్టిన త్రివిక్రమ్.. మరి అల్లు అర్జున్ సంగతేంటీ?

ఇక దేవర సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా చేస్తున్న ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఏ సినిమా వెచ్చే ఏడాది ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.