Priyanka Chopra: రూ.165 కోట్ల డ్రీమ్ హౌస్ని..ఖాళీ చేసిన ప్రియాంక చోప్రా..ఎందుకంటే?

Priyanka Chopra: రూ.165 కోట్ల డ్రీమ్ హౌస్ని..ఖాళీ చేసిన ప్రియాంక చోప్రా..ఎందుకంటే?

ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ఇప్పుడు హాలీవుడ్‌లో పుల్ బిజీ అయింది. హాలీవుడ్‌ సింగర్‌ నిక్‌ జోనస్‌( Nick Jonas)తో పెళ్లైన తర్వాత భారత్ వీడి లాస్ఏంజిల్స్కి ఆమె షిప్ట్ అయింది. ప్రస్తుతం భర్త నిక్‌, కూతురు మాల్టీ మేరీ చోప్రా జోనాస్‌తో  కలిసి అక్కడే ఉంటోంది.

అయితే ప్రియాంక తిరిగి ఇండియాకు వస్తుందని చాలా భావించారు. కానీ ఇండియాలోని తన ఆస్తులన్నింటిని వరుసబెట్టిఅమ్మేసి..లాస్‌ఏంజిల్స్‌లోనే శాశ్వతంగా నివాసం ఉండాలని నిర్ణయించుకుంది. అలా కొన్నాళ్ల క్రితం ప్రియాంక లాస్ ఏంజిల్స్లో రూ.165 కోట్లు పెట్టి కొనుగోలు చేసి ప్రస్తుతం అక్కడే ఉంటుంది. 

ఇదిలా ఉంచితే..లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనాస్ ఏంతో ఇష్టపడి 2019 లో రూ.165 కోట్లు ఖర్చు పెట్టి..కొన్న తమ డ్రీమ్ హౌస్ భవనాన్ని ఖాళీ చేసినట్లు సమాచారం. ఈ మేరకు బాలీవుడ్ మీడియా సంస్థలు ఈ విషయాన్ని వెల్లడించాయి. 

వివరాల్లోకి వెళితే..లాస్‌ఏంజిల్స్‌లో రూ.165 కోట్లు పెట్టి కొన్న ఇంట్లో తరుచు నీరు లీక్ అవుతుండటం వల్ల..చాలా చోట్ల గోడలు, నెల పాడైపోయినట్లు బాలీవుడ్ మీడియా తెలిపింది. 'నీరు ప్రతి గోడ అంచులకి పారడం వల్ల గోడలు బీటలు బారి బూజు వచ్చిందట. అలాగే కాలుష్యం కూడా పెరిగి..అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయని..ఆ భవనం అమ్మిన వ్యక్తిపై ఫిర్యాదు చేసిందట.

ఈ నేపథ్యంలోనే ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనాస్ మరో చోటికి వెళ్లిపోయారని తెలుస్తోంది. అలాగే రూ.165 కోట్లు ఖర్చు పెట్టి కొన్న ఇంట్లో తరుచూ నీరు రావడంతో..ఆ విలువైన భవనం అమ్మిన వ్యక్తిపై దావా వేసింది. అయితే మళ్ళీ ఆ భవనాన్ని మరమ్మత్తు చేయడం కోసం 13 నుంచి 20 కోట్ల వరకు అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.  

ఏడు బెడ్‌రూమ్‌లు, తొమ్మిది బాత్‌రూమ్‌లు, టెంపరేచర్ కంట్రోల్డ్ వైన్ సెల్లార్, చెఫ్ కిచెన్, హోమ్ థియేటర్, బౌలింగ్ అల్లే, స్పా మరియు స్టీమ్ షవర్, జిమ్ మరియు బిలియర్డ్స్ రూమ్‌లతో కూడిన విలాసవంతమైన ఆస్తిని 2019లో ప్రియాంక- నిక్ రూ.165కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. 

ప్రియాంక బాలీవుడ్‌ మూవీలో కనిపించి సుమారు మూడేళ్లు గడుస్తోంది. ఆమె చివరిగా 2021లో ది వైట్‌ టైగర్‌ అనే హిందీ సినిమాలో నటించింది. ప్రియాంక చోప్రా ప్రస్తుతం పలు ఇంగ్లిష్ సీరియల్స్, మూవీస్ , సిరీసుల్లో నటిస్తూ బిజీబిజీగా ఉంటోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్‌ సూపర్‌ హిట్‌గా నిలిచింది.