ఇంకా ఎంతమంది నిర్భయలు బలి కావాలి

ఇంకా ఎంతమంది నిర్భయలు బలి కావాలి

ఉత్తర్ ప్రదేశ్ హత్రాస్ ఘటనపై దేశ వ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని దేశ ప్రజలు, నేతలు, పలువురు సెలబ్రిటీలు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ప్రియాంక చోప్రా స్పందించారు. ప్రతీ అత్యాచారం మరొక సంఖ్య మాత్రమే కాదని పేర్కొంది. ఆ దారుణం వెనుక ఉన్న కుటుంబం ఎప్పటికీ భయానకంతో జీవిస్తుందో చెప్పింది. నిరంతరం క్రూరమైన చర్యలతో మహిళలు సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుందన్నారు.  హత్రాస్ బాధితురాలికి న్యాయం కోరుతూ ముందు ఓ కవిత రాసింది. నేరాలు జరుగుతుంటే మహిళలు, యువతులు ఏడుస్తున్న ఏడుపులు ఎవరికి వినబడవని హైలెట్ చేసింది. ఇంకా ఎంత మంది నిర్భయలు బలి కావాలి  అంటూ ప్రియాంక భావోద్యేగానికి లోనైంది.