ఆర్ఆర్ఆర్ చూసే టైం లేదు.. ప్రియాంక షాకింగ్ కామెంట్స్

ఆర్ఆర్ఆర్ చూసే టైం లేదు.. ప్రియాంక షాకింగ్ కామెంట్స్

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాకు ఆర్ఆర్ఆర్ సినిమా చూసేంత టైం లేదట. తాజాగా ఒక ఇంటర్నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్ఆర్ఆర్ మూవీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ప్రియాంక చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ప్రియాంక నటించిన లేటెస్ట్ హాలీవుడ్ వెబ్ సిరీస్ "సిటాడెల్". రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సిరీస్ కు ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు.. చాలా రోజులపాటు ట్రేండింగ్ లో కొనసాగింది ఈ సిరీస్.

ఇక ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా.. ఓ ఇంటర్నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చింది ప్రియాంక. ఇందులో భాగంగా.. యాంకర్ ప్రియాంకను మీరు ఆర్ఆర్ఆర్ మూవీ చూసారా ఎలా అనిపించింది అని అడిగింది. దానికి ప్రియాంక.. ఆర్ఆర్ఆర్ సినిమా చూసే అంత టైం నాకు లేదు. అలాగే నేను ఎక్కువగా టీవీ షోలు చూస్తాను, సినిమాలు చూడను అంటూ కామెంట్ చేసింది. దీంతో ఆమెను ట్రోలింగ్స్ తో  ఆడేసుకుంటున్నారు నెటిజన్స్.

ఇండియన్ సినిమాకి గర్వకారణంగా నిలిచిన ఆర్ఆర్ఆర్ సినిమా చూసే టైం లేకపోవడం ఏంటి అంటూ మండిపడుతున్నారు. ఓపక్క విదేశీయులు మన సినిమా గురించి గొప్పగా మాట్లాడుతుంటే.. నువ్వు ఇలా సినిమా చూసే టైం కూడా లేదు అనడం అసలేం బాలేదు అంటూ ప్రియాంకపై కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రియాంక చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.