కాంగ్రెస్ సార్వత్రిక ఎన్నికల్లో విఫలమైన తర్వాత ఆయా రాష్ట్రాల చీఫ్‌లు రాజీనామాల బాట పట్టారు. ఇందులో భాగంగా యూపీ కాంగ్రెస్ చీఫ్ రాజ్ బబ్బర్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ ఏడాది రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక గాంధీకి ఉత్తర ప్రదేశ్ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ తూర్పు యూపీ బాధ్యతలు చేపట్టిన ప్రియాంక.. ఇక రాష్ట్రం మొత్తం నాయకత్వం వహించనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో యూపీలోని 80 స్ధానాలకు గాను కాంగ్రెస్ కేవలం ఒక్క స్థానంలో మాత్రమే గెలిచింది. అమేథీలోనూ రాహుల్ గాంధీ ఓడిపోయారు. UPA ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ పోటీ చేసిన రాయ్‌బరేలీలో మాత్రమే కాంగ్రెస్ నిలిచింది.
