రోడ్డుపై ప్రియాంక గాంధీ బైఠాయింపు.. అరెస్ట్

రోడ్డుపై ప్రియాంక గాంధీ బైఠాయింపు.. అరెస్ట్

యూపీ సోన్ భద్ర కాల్పుల ఘటనలో గాయపడ్డ వారిని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పరామర్శించారు. జులై 17న జరిగిన ఘటనలో పది మంది చనిపోయారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు నారాయణ్ పూర్ వెళ్లేందుకు ప్రియాంక ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కేవలం నలుగురినే తన వెంట తీసుకెళ్తానని, బాధిత కుటుంబాలను కలుస్తానని చెప్పినా అధికారులు అనుమతి ఇవ్వడం లేదంటూ ప్రియాంక గాంధీ రోడ్డుపైనే బైఠాయించారు. శాంతియుతంగానే నిరసన చేపడుతామని అన్నారు. అయితే పోలీసులు ప్రియాంక గాంధీని అరెస్ట్ చేశారు. 144 సెక్షన్ విధించారు. బాధితులను కలిసేందుకు కూడా అవకాశం ఇవ్వకపోవడంపై ఫైర్ అయ్యారు.