ప్రియాంక రాకతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ లో పెరిగిన జోష్

ప్రియాంక రాకతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ లో పెరిగిన జోష్

వెలుగు: ఏఐసీసీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ చెల్లెలు ప్రియాంక గాంధీ రాజకీయాల్లోకి రావడంతో కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. నాలుగు వారాల్లో 10 లక్షల మంది కొత్త కార్యకర్తలు ఆ పార్టీలో చేరారు. కాంగ్రెస్ అంతగా బలంగా లేని తమిళనాడులో కొత్తగా రెండున్నర లక్షల మంది బూత్ లెవెల్ కార్యకర్తలుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అది కేవలం రెండు వారాల్లోనే కావడం గమనార్హం. ఉత్తరప్రదేశ్ లో క్యాడర్ సంఖ్య లక్షన్నర నుంచి మూడున్నర లక్షలకు పెరిగింది. దేశవ్యాప్తంగా బూత్ లెవెల్ కార్యకర్తల సంఖ్య 54 లక్షల నుంచి 64 లక్షలకు పెరిగినట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కేరళతోపాటు ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగిందని, బూత్ లెవెల్ కార్యకర్తల రిజిస్ట్రేషన్లే దీనికి నిదర్శనమని కాంగ్రెస్ డేటా అనలిటిక్స్ విభాగం చీఫ్ ప్రవీణ్ చక్రవర్తి అన్నారు. జనవరి 23న తూర్పు ఉత్తరప్రదేశ్ ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా ప్రియాంక గాంధీని నియమించగా ఆమె ఫిబ్రవరి 6న బాధ్యతలు చేపట్టారు.