అంకుల్ నెల్సన్.. నా గైడ్‌ : ప్రియాంకా గాంధీ

అంకుల్ నెల్సన్.. నా గైడ్‌ : ప్రియాంకా గాంధీ

మండేలా జయంతి రోజు ప్రియాంక ట్వీట్

న్యూఢిల్లీ:  “అంకుల్  నెల్సన్.. నాకు ఆదర్శం, ఆయన నా గైడ్”  అంటూ  కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ అన్నారు. తాను రాజకీయాల్లోకి రావాలని ఆయన గతంలోనే చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు. గురువారం దక్షిణాఫ్రికా మాజీ ప్రెసిడెంట్ నెల్సన్ మండేలా 101 జయంతి సందర్భంగా ఆమె ట్వీట్ చేశారు. సత్యం, ప్రేమ, స్వేచ్ఛకు ఆయన జీవితం నిదర్శనమన్నారు. 2001లో కొడుకుతో పాటు నెల్సన్ మండేలాతో దిగిన ఫొటోను షేర్ చేశారు. “నా కొడుకు ఫ్యాన్సీ టోపీని చూసి నవ్వుతున్న మండేలా” అని కాప్షన్ కూడా పెట్టారు. చాలా ఏళ్ల ఊహాగానాలకు తెర దించుతూ ప్రియాంక  గత జనవరిలో రాజకీయాల్లోకి వచ్చారు. ఉత్తర ప్రదేశ్ ఈస్ట్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు.