అది ఫేక్‌న్యూస్‌: ప్రియాంక గాంధీ

అది ఫేక్‌న్యూస్‌: ప్రియాంక గాంధీ
  • బంగ్లా ఖాళీ చేసేందుకు పర్మిషన్‌ అడగలేదని వెల్లడి

న్యూఢిల్లీ: ఢిల్లీలోని అధికారిక బంగ్లా ఖాళీ చేసేందుకు తనకు మరో నెల టైమ్‌ ఇవ్వాలని ప్రధానిని కోరలేదని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. తాను రిక్వెస్ట్‌ చేసినట్లు వస్తున్న వార్తలు అన్నీ ఫేక్‌ అని చెప్పారు. ప్రియాంక గాంధీ ప్రస్తుతం ఉంటున్న.. ఢిల్లీలోని లూథియానా 35 లోధీ ఎస్టేట్‌ బంగ్లాను ఖాళీ చేయాలని గత నెలలో కేంద్ర హోం శాఖ ప్రియాంక గాంధీకి నోటీసులు ఇచ్చింది. అయితే బంగ్లా ఖాళీ చేసేందుకు మరో నెల టైమ్‌ ఇవ్వాలని ప్రియాంక గాంధీ ప్రధానికి రిక్వెస్ట్‌ పెట్టారని వార్తలు వచ్చాయి. దీంతో దీనిపై ఆమె స్పందించారు. “ ఇది ఫేక్‌ న్యూస్‌. నేను ఎలాంటి రిక్వెస్ట్‌ చేయలేదు. ఆగస్టు 1కి బంగ్లా ఖాళీ చేస్తాను” అని ప్రియాంక ట్వీట్‌ చేశారు. కాగా..దీనిపై ఆమె భర్త రాబర్ట్‌ వాద్రా కూడా స్పందించారు. “ మేం ఎవ్వర్నీ ఎక్స్‌టెన్షన్‌ కోసం సంప్రదించలేదు. 30 రోజుల్లో ఖాళీ చేయాలని నోటీసులు వచ్చాయి. కరోనా ఇబ్బందుల్లో కూడా మొత్తం ఇంటిని సర్దేసుకున్నాం. గడువు ఇచ్చిన దాని కంటే వారం ముందే బంగ్లా ఖాళీ చేస్తున్నాం” అని రాబర్ట్‌ వాద్రా ట్వీట్‌ చేశారు. అయితే దానిపై కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీ స్పందించారు. జులై 4న కాంగ్రస్‌ పార్టీ నుంచి తనకు ఫోన్‌ వచ్చిందని, ఆ బంగ్లా కాంగ్రెస్‌ ఎంపీకే కేటాయించాలని కోరారని, దాని ద్వారా ప్రియాంకా అక్కడే ఉండేందుకు ఇబ్బంది ఏర్పడదని కోరారని ఆయన అన్నారు.