ప్రియాంక గాంధీ 3 రోజుల గంగాయాత్ర ప్రారంభం

ప్రియాంక గాంధీ 3 రోజుల గంగాయాత్ర ప్రారంభం

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ వాద్రా 3 రోజుల గంగాయాత్ర ప్రారంభమైంది. 140 కిలోమీటర్లు ఈ గంగాయాత్ర చేపట్టనున్నారు ప్రియాంక. తీరంలోని గ్రామాల ప్రజలను కలుసుకుంటూ, వారి సమస్యలు తెలుసుకుంటూ ప్రచారం కొనసాగించనున్నారు ప్రియాంక.

ప్రయాగ్ రాజ్ లోని ఛట్ నాగ్ తీరం నుంచి గంగా బోట్ యాత్ర ప్రారంభించారు. అక్కడికి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు తరలి వచ్చాయి. త్రివేణి సంగమం దగ్గర ప్రత్యేక పూజల్లో పాల్గొన్న తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలతో ప్రియాంక మాట్లాడారు. అంతకు ముందు ప్రయాగ్ రాజ్ లోని బడే హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు.