ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ హ్యాక్ కాలేదు
V6 Velugu Posted on Dec 24, 2021
న్యూఢిల్లీ: కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా పిల్లల ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ హ్యాక్ కాలేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఫోన్ ట్యాపింగ్ చేయడమే కాకుండా తన పిల్లలు మిరయా వాద్రా, రైహాన్ వాద్రాల ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లను ప్రభుత్వం హ్యాక్ చేసిందని ప్రియాంక మంగళవారం ఆరోపించారు. ఆమె అధికారికంగా ఫిర్యాదు చేయకపోయినా కేంద్రం ఆమె ఆరోపణలను సీరియస్గా తీసుకుని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ తో దర్యాప్తు చేయించింది. ప్రియాంక పిల్లల ఖాతాలు హ్యాక్ అవలేదని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు ప్రభుత్వం గురువారం వెల్లడించింది.
Tagged Priyanka Gandhi, Instagram Not Hacked, Priyanka Children Instagram Hacked