
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. తనను ఒక డైరెక్టర్ లో దుస్తులన్నీ తీసేమన్నాడు అని చెప్పి అందరికీ షాకిచ్చింది. ఈమేరకు తాజాగా ఇచ్చిన ఓ మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. తన కెరీర్ ప్రారంభంలో ఓ సన్నివేశం చిత్రీకరిస్తుండగా.. బాలీవుడ్ దర్శకుడు తన లో దుస్తులను చూడాలనుకున్నారని చెప్పింది. దాదాపు 20 సంవత్సరాల క్రితం ఈ సంఘటన జరిగినట్లు తెలిపింది.
ఇక ప్రియాంక మాట్లాడుతూ.. 'అప్పుడప్పుడే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాను. ఒక సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఒక రోజు సాంగ్ షూట్ జరుగుతోంది.. అప్పుడు ఆ డైరెక్టర్ నా దగ్గరకు వచ్చి డ్యాన్స్ చేసేటప్పుడు లో దుస్తులన్నీ తీసేయాలని చెప్పాడు. దాంతో నాకు చాలా కోపం వచ్చింది. అందుకు నేను ఒప్పుకోలేదు. ఆ మరుసటి రోజే ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాను.' అంటూ ప్రియాంక చోప్రా తనకు గతంలో జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంది. అయితే ఆ దర్శకుడు ఎవరు అనేడి మాత్రం చెప్పలేదు ప్రియాంక. ఇక ఆమె చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక ప్రియాంక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. ఈ సిరీస్ కు ఆడియన్స్ నుండి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.