రాజకీయాల్లో మార్పు తెస్తా : ప్రియాంక

రాజకీయాల్లో మార్పు తెస్తా : ప్రియాంక

యూపీ ఓటర్లకు బహిరంగ లేఖ నేటి నుంచి గంగా యాత్ర

లక్నో: ప్రజల భాగస్వామ్యం లేకుండా రాజకీయాల్లో మార్పు అసాధ్యమని కాం గ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ అన్నారు. జనం కష్టాలు వినేందుకే జల మార్గంలో వస్తున్నానని, సత్యం , నమ్మకాలే పునాదిగా రాజకీయాల్లో మార్పులు తెస్తానని స్పష్టం చేశారు. లోక్ సభ ఎన్నికల క్రమంలో ఉత్తరప్రదేశ్ ప్రజలకు ఆదివారం బహిరంగ లేఖ రాశారామె. యూపీ తో తన అనుబంధం ఈనాటిది కాదన్న ప్రియాంక, ప్రస్తుతం రాజకీయాల్లో అనిశ్చితి నెలకొందని, మహిళలు, యువత, రైతులు, కూలీలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తుచేశారు. ప్రజలు తమ బాధల్ని చెప్పుకోవాలనుకుంటున్నా, రాజకీయ నేతల గిమ్మిక్కు లతో అది సాధ్యం కావడంలేదని, కాబట్టే వాళ్ల కష్టాలు వినడానికి నేరుగా వాళ్లున్న చోటికే వెళుతున్నానని తెలిపారు.” మీ కష్టాలు తెలుసుకోకుండా రాజకీయాల్లో మార్పు సాధ్యం కాదు. అందుకే మిమ్మల్ని కలిసేందుకు నేరుగా వస్తున్నా’’ అని ప్రియాంక లేఖలో తెలిపారు. గంగా యాత్ర పేరుతో ప్రియాంక చేపటనున్న జల యాత్ర సోమవారం  ప్రయాగ్ రాజ్ నుంచి ప్రారంభం కానుంది. గంగా నదిలో 120 కిలోమీటర్లు సాగే యాత్ర బుధవారం వారణాసిలో ముగుస్తుంది.

ఆదివారమే లక్నోకు చేరు కున్న ప్రియాంక, పార్టీ పదాధికారులు, కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహించారు. గంగా యాత్రలో భాగంగా విద్యార్థులతో ‘బోట్ పే చర్చ’ కార్యక్రమంలో  పాల్గొంటారు. ఆ ఏడు స్థా నాల్లో పోటీ చేయంలోక్ సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లోని ఏడు స్థానా ల్లో తాము పోటీ చే యట్లేదని కాం గ్రెస్ పార్టీ ఆదివారం ప్రకటించింది. బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ ప్రెసిడెంట్ అఖిలేశ్ కూటమి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. వీటిలో సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం స ింగ్ యాదవ్ పోటీ చే స్తున్న మైన్ పురి, ఆయన కోడలు డింపుల్ యాదవ్ పోటీ చేసే కనౌజ్, ఆర్ఎల్డీ నేతలు అజిత్ సింగ్, జయంత్ చౌదరి, బీఎస్పీ అధినేత్రి మాయావతి పోటీచేసే స్థానా లు ఉన్నాయి. ఎస్పీ, బీఎస్పీ కూటమి నేతలు పోటీ చేసే  ఏడు స్థానా ల్లో తాము బరిలో కి దిగట్లేదని కాంగ్రెస్ నా యకుడు రాజ్ బబ్బర్ చెప్పారు.