బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌ కబడ్డీ టీమ్‌‌‌‌‌‌‌కు తెలంగాణ కోచ్‌‌‌‌‌‌‌‌

బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌ కబడ్డీ టీమ్‌‌‌‌‌‌‌కు తెలంగాణ కోచ్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు:  ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌లో పోటీపడే బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌ మెన్స్‌‌‌‌‌‌‌‌ సీనియర్‌‌‌‌‌‌‌‌ కబడ్డీ టీమ్‌‌‌‌‌‌‌‌కు తెలంగాణకు చెందిన లింగంపల్లి  శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ రెడ్డి కోచ్‌‌‌‌‌‌‌‌గా పని చేస్తున్నాడు. ప్రస్తుతం ఢాకాలో బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌ ఆటగాళ్లకు ఆటలో మెళకువలు నేర్పిస్తున్నాడు. 2018లో దుబాయ్ మాస్టర్స్‌‌‌‌‌‌‌‌ టోర్నీ గెలిచిన ఇండియా సీనియర్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌కు కోచ్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరించిన సంగారెడ్డి జిల్లాకు చెందిన  శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ రెడ్డితో బంగ్లా టీమ్‌‌‌‌‌‌‌‌ రెండు నెలల కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌ కుదుర్చుకుంది. 

హర్యానాకు చెందిన  చజు రామ్‌‌‌‌‌‌‌‌తో కలిసి  బంగ్లా టీమ్ ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌ ప్రిపరేషన్స్‌‌‌‌‌‌‌‌ను అతను పర్యవేక్షిస్తున్నాడు. ఈ ఇద్దరి ఆధ్వర్యంలో బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌ మహారాష్ట్ర  కొల్హాపూర్‌‌‌‌‌‌‌‌లో 45 రోజుల ట్రెయినింగ్‌‌‌‌‌‌‌‌ క్యాంప్‌‌‌‌‌‌‌‌లో కూడా పాల్గొన్నది. ‘ఈ ఏడాది జూనియర్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌తో పని చేశా. ఆ టోర్నీలో టీమ్‌‌‌‌‌‌‌‌ బాగా ఆడటంతో ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌ కోసం పని చేయాలని బంగ్లా సీనియర్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ నుంచి కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌ వచ్చింది. నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. యంగ్‌‌‌‌‌‌‌‌స్టర్లతో కూడిన బంగ్లా టీమ్‌‌‌‌‌‌‌‌లో టాలెంటెడ్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లున్నారు. 

ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌లో మెడల్‌‌‌‌‌‌‌‌ నెగ్గాలని ఆశిస్తున్నారు. అందుకోసం ముమ్మరంగా ట్రెయినింగ్‌‌‌‌‌‌‌‌ ఇస్తున్నాం. ప్లేయర్లతో రియల్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ కాంపిటీషన్లు నిర్వహిస్తూ  వారిని రెడీ చేస్తున్నాం’ అని శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ రెడ్డి ‘వెలుగు’తో చెప్పాడు.  కాగా, రాబోయే ప్రో కబడ్డీ లీగ్‌‌‌‌‌‌‌‌ సీజన్‌‌‌‌‌‌‌‌లో తెలుగు టైటాన్స్‌‌‌‌‌‌‌‌ జట్టుకు శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ హెడ్‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరించనున్నాడు.