ముఖంపై వెంట్రుకల సమస్య.. ఏం చేయాలంటే

ముఖంపై వెంట్రుకల సమస్య.. ఏం చేయాలంటే
  • సీతాఫలం ఆకుల  ప్యాక్

టెస్టోస్టిరాన్​ హార్మోన్‌ తక్కువగా ఉండటం, జెనిటిక్​ కారణాల వల్ల కొందరికి ముఖంపై వెంట్రుకలు వస్తాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఈ వంటింటి టిప్స్​.

  • అర టేబుల్ స్పూన్​ పసుపులో ఒక టేబుల్ స్పూన్​ పెరుగు, అర టేబుల్ స్పూన్​ బియ్యప్పిండి వేసి బాగా కలపాలి.  ఆ మిశ్రమాన్ని అవాంఛిత రోమాలున్న చోట రాయాలి. పదినిమిషాల తర్వాత ముఖాన్ని మసాజ్​ చేయాలి. ఇలా వారానికోసారి చేస్తే అవాంఛిత రోమాలు ఊడిపోతాయి. 
  • అరటిపండు గుజ్జులో రెండు టీ స్పూన్​ల ఓట్​మీల్ కలిపి రోమాల మీద రాసి  ఇరవైనిమిషాల తర్వాత కడిగినా రిజల్ట్​​  బాగుంటుంది.
  • పుదీనా రసం వారానికోసారి  మూడు నెలలపాటు తాగితే ముఖంపై వెంట్రుకలు రాలిపోతాయి. అలాగే సీతాఫలం ఆకులను ముద్దగా నూరి  వెంట్రుకలపై ప్యాక్​లా వేసినా ఫలితం ఉంటుంది. 
  •   కోడిగుడ్డు తెల్లసొనలో అర టేబుల్ స్పూన్​ మొక్కజొన్న పిండి, ఒక టేబుల్ స్పూన్​ చక్కెర వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖంపై అవాంఛిత రోమాలున్న చోట రాసి 20 నిమిషాల తర్వాత ఆ ప్యాక్​ని వేళ్లతో  నెమ్మదిగా మసాజ్​ చేస్తూ  తీసేయాలి. 

ఇలా తరచూ చేస్తే అవాంఛిత  రోమాల సమస్య నుంచి తేలికగా బయటపడొచ్చు.