రంగారెడ్డి జిల్లాలో 400 పోలింగ్‌ కేంద్రాలు సమస్యాత్మకం

రంగారెడ్డి జిల్లాలో 400 పోలింగ్‌ కేంద్రాలు సమస్యాత్మకం

రంగారెడ్డి జిల్లాలో 21 జడ్పీటీసీలు, 257 ఎంపీటీసీ స్థానాలకు 3 విడతలుగా జరిగేస్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ లోకేష్‌ కుమార్‌ అన్నారు. కలెక్టరేట్ లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై జిల్లా ఎన్నికల అధికారి లోకేష్‌ సోమవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు విడతల్లో ఎన్నికలు జరుగుతాయన్నారు. మొదటి విడతలో చేవెళ్ల, శంకర్ పల్లి, మెయినాబాద్‌, షాబాద్‌, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లా పూర్‌ మెట్‌, మంచాల్ లో ఎన్నికలు జరగనున్నాయన్నారు. రెండో విడతల్లో నందిగామ, కొత్తూర్‌, ఫరూఖ్ నగర్‌, కేశంపేట్‌, కొందుర్గు, చౌదరిగూడ, కందుకూర్‌, మహేశ్వరం… మూడో విడత ఎన్నికల్లో ఆమన్ గల్‌, కడ్తాల్‌, తలకొండపల్లి, శంషాబాద్‌, మాడ్గుల, యాచారం మండలాల్లో జరుగుతాయని ఎన్నికల అధికారి తెలిపారు. మూడు విడతల్లో జరిగే ఎన్నికల్లో 582 ప్రాంతాల్లో 1,433 పోలింగ్ కేంద్రాలలో 7,31,726 మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకొంటారన్నారు.

ఎన్నికల విధుల్లో ఆర్ వోస్, ఏఆర్ ఎస్‌ 178 మంది, పీవోస్‌ 1,725, ఏపీవోస్‌ 1,725, ఓపీవోస్‌6,900 మంది, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ 21 బృందాలు, సర్వేలైన్స్‌ బృందాలు 5, జోనల్‌ అధికారులు 42మంది, అబ్జర్వర్లును 21 మందిని నియమించినట్లు వివరించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు ఈ నెల 18న శిక్షణ పూర్తయిందన్నారు. మరో విడత శిక్షణ ఈనెల 30వ తేదీన ఇవ్వనున్నట్లు తెలిపారు. 1,433 పోలింగ్ కేంద్రాలలో 400 కేంద్రాలు సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించామన్నారు. వీటిలో 131 కేంద్రాలను సున్నితమైనవిగా గుర్తించడం జరిగిందన్నారు.

సమస్యాత్మక కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్‌ నిర్వహించడంతో పాటు పటిష్టమైన కేంద్ర బలగాల బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకునేందుకు పింక్‌ కలర్‌ ఎంపీటీసీకి, వైట్‌ కలర్‌ జడ్పీటీసీకి బ్యాలెట్‌ పేపర్లను వాడాలన్నారు. కౌంటింగ్ కు సంబంధించి చేవెళ్ల, షాద్‌నగర్‌, ఆమనగల్లు, శంషాబాద్‌, ఇబ్రహీంపట్నంలలో మొత్తం 5 కేంద్రాలను ఏర్పాటుచేశామన్నారు. ప్రతి మండలానికి ఒక స్ట్రాంగ్‌ రూం రెండు కౌంటింగ్‌ హాళ్లను, 2 వేల ఓటర్లకు ఒక టేబుల్‌ చొప్పున ఏర్పాటు చేస్తామన్నారు.3 స్టేజీలలో ఓట్ల లెక్కింపు జరుగుతుందని వివరించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్లను వేరు చేసి,ప్రతి మండలానికి 12 టేబుళ్లను ఏర్పాట్లు చేసిఓట్లను లెక్కిం పు చేస్తామన్నా రు. దివ్యాంగులకువీల్ ఛైర్​లు, ఆటో సౌకర్యం కల్పిస్తామని కలెక్టర్‌పేర్కొన్నా రు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక-్టర్‌ హరీష్‌, జడ్పీ సీఈవో జితేం దర్‌ రెడ్డి తదితరులుపాల్గొన్నా రు.