వాటర్ ఎక్కువగా తాగినా సమస్యే!

వాటర్ ఎక్కువగా తాగినా సమస్యే!

ఎండాకాలం వచ్చేస్తోంది. దీంతో వేడిని తట్టుకునేందుకు, దాహాన్నితీర్చుకునేందుకు మనం ఎక్కువగా తాగేది నీళ్లే. నీళ్లు తాగడం ద్వారా శరీరం డీహైడ్రేట్ కాకుండా కాపాడుకోవచ్చు. అయితే డీ హైడ్రేషన్ లాగానే ఓవర్ హైడ్రేషన్ కూడా ప్రమాదకరమే. నీళ్లను ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో నీటి శాతం పెరుగుతుంది. దీనివల్ల సోడియం స్థాయిపడిపోతుంది. ఇది ఒక్కోసారి మెదడు వాపు రావడానికి కూడా కారణమవుతుంది. దీనినే వాటర్ ఇంటాక్సినేషన్ అంటారు. దీనినే వాటర్ పాయిజనింగ్ అని కూడా అంటారు. రక్తంలో సోడియం శాతం తగ్గడాన్ని హైపోనట్రేమియా)వాటర్ ఇంటాక్సినేషన్ గా చెబుతారు. అంటే శరీరానికి అవసరమైనంత సోడియంను భర్తీ చేయకుండా కేవలం నీటిని మాత్రమే తాగడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. ముఖ్యంగా ఎలక్ట్రో లైట్ ఇంబ్యాలెన్స్ వలన ఈ అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే తగినంత నీటిని తీసుకోవడం వలన శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది. టాక్సిన్స్ శరీరంలోంచి బయటకుపోతాయి. అలాగే శరీరంలోని అన్ని మేజర్ ఫంక్షన్స్ సజావుగా సాగుతాయి. అందుకోసం మనం రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీటిని తీసుకుంటే సరిపోతుంది. అంతే తప్ప బలవంతంగా ఎక్కువ నీటిని తీసుకుంటే వాటర్ ఇంటాక్సినేషన్ సమస్య తప్పదని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు.