రాష్ట్రపతి ఎన్నిక నోటిఫికేషన్ విడుదల

రాష్ట్రపతి ఎన్నిక నోటిఫికేషన్ విడుదల

న్యూఢిల్లీ : దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. ప్రెసిడెంట్ ఎలక్షన్ కు సంబంధించి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇవాళ్టి నుంచి జూన్ 29 వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశమిచ్చారు. జూన్ 30న నామినేషన్ పత్రాలను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఎలక్షన్ కమిషన్ జులై 2 వరకు గడవు ఇచ్చింది. జులై 18న రాష్ట్రపతి ఎన్నిక కోసం పోలింగ్ జరగనుండగా.. 21న ఫలితాలు వెలువడనున్నాయి. 

ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం జులై 24తో ముగియనుంది. ఈ క్రమంలో ఆ ఖాళీని భర్తీ చేసేందుకు ఈసీ సిద్ధమైంది. జులై 25న కొత్త ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకరం చేయనున్నారు. భారతీయ పౌరులై ఉండి 35 ఏళ్ల వయసు కలిగిన వారు రాష్ట్రపతి పదవికి పోటీ చేయవచ్చు. అయితే వారు లోక్ సభ సభ్యులు అయ్యేందుకు అవసరమైన అర్హతలు కలిగి ఉండటంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో గానీ, లాభదాయక పదవుల్లో కొనసాగరాదు.