ఎన్టీఆర్ సినిమాతో నిర్మాతకి భారీ నష్టం... ఆస్తులు అమ్మేసి అప్పులు తీర్చాడట

ఎన్టీఆర్ సినిమాతో నిర్మాతకి భారీ నష్టం... ఆస్తులు అమ్మేసి అప్పులు తీర్చాడట

తెలుగులో పలు హిట్ సినిమాలని నిర్మించాడు ప్రముఖ సీనియర్ సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్. ఈ మధ్య బెల్లంకొండ సురేష్ పలు వ్యక్తిగత కారణాలవల్ల సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. అయితే ఇటీవలే బెల్లంకొండ సురేష్ ఓ ఇంటర్వూలో తన కెరీర్ లో ఎదుర్కున్న నష్టాల గురించి పలు ఆసక్తికర విషయాలని ప్రేక్షకులతో పంచుకున్నాడు. 

ఇందులో భాగంగా ఎన్టీఆర్ తో తీసిన రభస సినిమాతో భారీ నష్టం వచ్చిందని తెలిపాడు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఔట్ పుట్ చూసి సినిమా ఫ్లాప్ అవుతుందని ముందే గెస్ చేశామని దాంతో మధ్యలోనే ఆపేద్దామని అనుకున్నామని అన్నాడు. కానీ ఎన్టీఆర్ ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని తనని కన్వెన్స్ చెయ్యడంతో షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ చేయగా ఫ్లాప్ అయ్యిందని వెల్లడించాడు

ALSO READ | సీరియల్స్ స్టార్ నటుడు సాయి కిరణ్ మళ్లీ పెళ్లి.. వధువు ఎవరంటే..?

తమిళ్, మలయాళం నుంచి కొన్ని సినిమాలు కొని డబ్బింగ్ చేసి రిలీజ్ చేశామని, కానీ ఈ సినిమాలు కూడా సరిగ్గా ఆడకపోవడంతో తీవ్ర నష్టాల్ని తెచ్చిపెట్టాయని తెలిపాడు. దాంతో ఒకానొక సమయంలో ఆర్ధిక సమస్యలు ఇబ్బందిపెట్టడంతో ఆస్తులు అమ్మేసి అప్పులు తీర్చానని చెప్పుకొచ్చాడు. అయితే సినీ ఇండస్ట్రీలో లాభనష్టాలు కామన్ అని దాంతో మళ్ళీ జాగ్రత్తగా ప్లాన్ చేసి సినిమాలు తీసుకుంటున్నామని ఇప్పుడు ఆర్థికంగా బాగానే స్థిరపడ్డామని తెలిపాడు. 

ఈ విషయం ఇలా ఉండగా గతంలో నిర్మాత బెల్లంకొండ సురేష్ మా అన్నయ్య, ఆది, చేరఁన్నకేశవ రెడ్డి, లక్ష్మీ నరసింహ, శంభో శివ శంభో, బస్ స్టాప్, అల్లుడు శ్రీను, తదితర హిట్ సినిమాలతో పాటూ మరిన్ని సినిమాలని నిర్మించాడు. కానీ 2004లో ఓ ప్రముఖ హీరో ఇంట్లో జరిగిన కాల్పుల సంఘటన కారణంగా కొంతకాలంపాటూ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు.