సీరియల్స్ స్టార్ నటుడు సాయి కిరణ్ మళ్లీ పెళ్లి.. వధువు ఎవరంటే..?

సీరియల్స్ స్టార్ నటుడు సాయి కిరణ్ మళ్లీ పెళ్లి.. వధువు ఎవరంటే..?

టాలీవుడ్ ప్రముఖ నటుడు సాయి కిరణ్ పెళ్లి చేసుకున్నాడు. కాగా సాయి కిరణ్ తెలుగులో స్టార్ హీరో తరుణ్ హీరోగా నటించిన "నువ్వే కావాలి" అనే సినిమా ద్వారా కెరీర్ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత "ప్రేమించు" సినిమాలో  సోలో హీరోగా నటించాడు. ఈ సినిమా ఫర్వాలేదనిపించినప్పటికీ ఆశించిన స్థాయిలో హీరోగా ఆఫర్లు అందుకోలేకపోయాడు. ఈ క్రమంలో కామియో అప్పీయరెన్స్, గెస్ట్ అప్పీయరెన్స్ పాత్రల్లో నటించాడు. ఆ తర్వాత బుల్లి తెరపై పలు సీరియల్స్ లో నటించాడు. వెండితెరపై కంటే బుల్లితెరపై ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాడు.

అయితే బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించిన ప్రముఖ సీరియల్ నటి స్రవంతిని సాయి కిరణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో శనివారం వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని సాయి కిరణ్ మరియు స్రవంతి సోషల్ మీడియా వేదికగా తమ అభిమానులకి తెలిపారు. అంతేగాకుండా పెళ్లి వీడియోల్ని కూడా షేర్ చేశారు. దీంతో అభిమానులు సాయి కిరణ్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

ALSO READ | చెప్పకనే చెప్పేశారు: గర్ల్‌ఫ్రెండ్ కోసం బాయ్ ఫ్రెండ్ పోయెటిక్ లైన్స్.. అస్సలు పడనంటున్న రష్మిక

అయితే సాయి కిరణ్, స్రవంతి గతంలో కోయిలమ్మ అనే సీరియల్ లో కలసి నటించారు. అలాగే పలు ప్రయివేట్ ఆల్బమ్ సాంగ్స్ లో కూడా నటించారు. ఈ క్రమంలోనే ఒకరికొకరు మధ్య ప్రేమ చిగురించడంతో పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారని తెలుస్తోంది.

ఈ విషయం ఇలా ఉండగా నటుడు సాయి కిరణ్ గతంలో వైష్ణవి అనే మహిళని పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్లయిన కొన్నేళ్ళకి ఇద్దరిమధ్య మనస్పర్థలు, విబేధాలు రావడంతో విడిపోయారు. వీరికి ఒక పాప కూడా ఉంది. స్టార్ మాలో ప్రసారమైన కోయిలమ్మ అనే సీరియల్ ద్వారా బుల్లితెర ఆడియన్స్ కి బాగానే దగ్గరయ్యాడు. ఈ సీరియల్ లో సాయికిరణ్ సంగీతం నేర్పించే టీచర్ పాత్రలో నటించాడు. ప్రస్తుతం సాయి కిరణ్ తెలుగులో పడమటి సంధ్యారాగం అనే సీరియల్ లో నటిస్తున్నాడు.