చిన్న సినిమాలకు మనుగడ కరువైంది

చిన్న సినిమాలకు మనుగడ కరువైంది

చిన్న సినిమాలకు మనుగడ కరువైందని సీనియర్ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు అన్నారు. రఘు కుంచె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మా నాన్న నక్సలైట్’. అజయ్, జీవా, సుబ్బరాజు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను చదలవాడ బ్రదర్స్ సమర్ఫణలో అనురాధ ఫిల్మ్స్ డివిజన్ పతాకంపై చదలవాడ శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. 90ల్లో జరిగిన కథతో ఈ సినిమాను సునీల్ కుమార్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. 

ఈ నేపథ్యంలో 'మా నాన్న నక్సలేట్' సినిమా ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా నిర్మాత చదలవాడ మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీ లో ఎల్ఎల్‌పి (ప్రస్తుతం గ్రిల్డ్ అనే పేరు మార్పు) అనే క్యాన్సర్ సంస్థ స్టార్ట్ అయ్యిందన్నారు. చిన్న సినిమాలకి యాడ్స్ ఇవ్వాలంటే వాళ్ళకి కమీషన్ ఇవ్వాలి అని ఆరోసించారు. ఎల్ఎల్‌పి అంటే మా సాటి నిర్మాతలే.. ఒక నిర్మాత సినిమా తీస్తే ఇంకో నిర్మాతకి కమీషన్ ఇవ్వటం ప్రపంచంలో ఎక్కడ ఉండదు.. ఆ ధౌర్భాగ్యం మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉంది అన్నారు. నాలాంటి నిర్మాతలు ఒక మంచి సినిమా తీస్తే దానికన్నా డబుల్ కమీషన్ ఎల్ఎల్‌పి కి ఇవ్వాల్సివస్తోంది అని అవేదన వ్యక్తం చేశారు.

పెద్ద నిర్మాతలు ఇలాగే చేస్తే చిన్న నిర్మాతలు నక్సలైట్ గా మారే అవకాశం ఉందన్నారు నిర్మాత చదలవాడ. సినిమా ఇండస్ట్రీ లో ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఈ రెండే వెల్ విషేర్స్ గా ఉన్నాయి. మొన్న సమ్మె విషయంలో కూడా ఛాంబర్ ద్వారా రెండు గంటల్లో సమస్య పరిష్కారం అయ్యిందన్నారు. అలాంటి ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో కూడా ఇండస్ట్రీ పెద్దలంటూ రాజకీయం చేస్తున్నారు. చిన్న నిర్మాతలను ఎదగనివ్వడం లేదని చెప్పారు. పెద్ద పెద్ద హీరోలు ఎల్ఎల్‌పి లకు సపోర్టు చేస్తున్నారు. ఇది నా ఒక్క సినిమా గురించి చెప్పడం లేదు.. సగటు నిర్మాత పడే బాధ గురించి చెబుతున్నాను నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.