లక్షలు ఖర్చు పెట్టినా రాని పబ్లిసిటీ..మీ కాంట్రావర్సి వల్ల వచ్చింది: అయలాన్ నిర్మాత

లక్షలు ఖర్చు పెట్టినా రాని పబ్లిసిటీ..మీ కాంట్రావర్సి వల్ల వచ్చింది: అయలాన్ నిర్మాత

కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ (Siva Karthikeyan) గురించి, ఆయన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. వరుణ్ డాక్టర్, కాలేజ్ డాన్, ప్రిన్స్, మహావీరుడు సినిమాలు తెలుగులో సూపర్ సక్సెస్ అయ్యాయి.దీంతో ఆయన సినిమాలకు ఇక్కడ కూడా మంచి డిమాండ్ ఏర్పడింది.  

ప్రస్తుతం శివ కార్తికేయన్ హీరోగా నటిస్తోన్న సైన్స్ ఫిక్ష‌న్ ఫాంట‌సీ మూవీ అయలాన్ (Ayalaan). ఇపుడు ఈ సినిమా స‌ర్వ‌త్రా ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. సంక్రాంతి పండ‌క్కి  జనవరి 12న రిలీజ్ అవుతుందనుకున్నఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యింది.ఈ సినిమాపై వస్తోన్న తప్పుడు కథనాలపై ప్రొడక్షన్ హౌస్ గట్టిగా స్పందించింది.

రవితేజ ఈగల్ సినిమా వెనక్కి తగ్గడంతో అయలాన్ ముందుకు వచ్చిందని, ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాకు సపోర్ట్ గా ఉన్నాడని వార్తలు కూడా వస్తున్నాయి. అయితే అందులో ఏది నిజం కాదని మహేశ్వర్ రెడ్డి నోట్ రిలీజ్ చేస్తూ స్పష్టం చేశాడు.

“మా అయలాన్ మూవీని 4 నెలల ముందు నుంచే సంక్రాంతి కి తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేస్తామని అనౌన్స్ చేసాము. సంక్రాంతి బరినుంచి ఒక తెలుగు చిత్రం తప్పుకోడం వల్లే మేము ముందుకొచ్చామని, కొన్ని మీడియా వార్తలు వింటే హాస్యాస్పదంగా ఉంది. అక్కడితో ఆగకుండా ఓ ప్రముఖ వ్యక్తీ దీని వెనక ఉన్నట్టు రాయడం సదరు మీడియా సంస్థల సంస్కారానికి నిదర్శనం. నిర్మాతలందరూ కలిసి మాట్లాడుకున్న తరువాతే కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే ఆరోగ్యకరమైన వాతావరణం తెలుగు చిత్రసీమలో ఉండటం వల్లే ఈ పండక్కి..అందరికి ఆహ్లాదాన్ని అందిచడానికి కొన్ని నిర్ణయాలు తీస్కోడం జరిగింది. అందులో భాగంగానే మా సినిమాను వాయిదా వెయ్యడం జరిగింది. 

ఇవన్నీ తెలీక, మిడిమిడి జ్ఞానం తో కొంత మంది మీడియా మిత్రులు రాసిన కథనాలు చూస్తే వాళ్ళ మీద జాలేస్తుంది. భావ వ్యక్తీకరణ,వాక్స్వాతంత్ర్యం ఇవన్నీ రాజ్యాంగం మనకు కలిపించిన హక్కులే, కానీ అవన్నీ నిజ నిర్ధారణ జరిగిన తరువాతే వర్తిస్తాయి. ఏది పడితే అది ఊహించుకుంటా, ఎలా పడితే అలా రాస్తా అనే ధోరణీలో ఉన్న కొన్ని చెత్త వెబ్ సైట్స్ వల్ల పక్క రాష్ట్రాల్లో కూడా మన మీద గౌరవం తగ్గడం తో పాటు వివిధ భాషల్లో విడుదలయ్యే మన సినిమాల మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న సౌత్ సినిమా హద్దులు దాటి, పాన్ ఇండియా, పాన్ వరల్డ్ అని దూసుకుపోతున్న తరుణంలో మన కలహం వల్ల భారీనష్టం జరగోచ్చు.

ఓ మంచి సినిమా ప్రివ్యూ చూసి కూడా అకౌంట్ లో డబ్బులు పడితే గాని 'కలం కదలని కొంత మంది అమాత్యులు..ఇలాంటి విషయాల్లో మాత్రం ముందుండి మరీ కాంట్రవర్సీ సృష్టిస్తున్నారు. అందుకేనేమో ఈ మధ్య నిర్మాతలు కూడా కాంట్రవర్సిలతో పబ్లిసిటీ చేసుకుంటున్నారు. మన పరిచయం లోనే సినిమా' ఉన్నప్పుడు, ఆ సినిమా గురించే తప్పుడు రాతలు రాసి ప్రేక్షకులను తప్పు దారి పట్టిద్దాం అనుకునేవారికి ఇకపై కష్టకాలమే. డబ్బులు తీస్కోని కొంత మంది రాసే రివ్యూ లు చూసి సినిమా చూసిన ప్రేక్షకుడు మిమ్మల్ని నమ్ముతాడా.

సినిమా మీదే బతుకుతూ సినిమానే దూషించే ఆ కొంత మంది కాంట్రావర్సి చేసే వాళ్ళకి ఆఖరుగా చెప్పేదేంటంటే..లక్షలు ఖర్చు పెట్టి చేసినా రాని పబ్లిసిటీ, మీ కాంట్రావర్సి వల్ల మా చిత్రానికి దక్కడం సంతోషం, చాలా త్వరగా మా సినిమాను ప్రేక్షకులకి చేర్చినందుకు కాంట్రవర్సీ మీడియా మిత్రులకి ధన్యవాదాలు. వీటన్నిటికి దూరంగా ఉన్న మిగితా మంచి మీడియా మిత్రులకు కృతజ్ఞతలు. త్వరలోనే మా “అయలాన్” చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ ని ప్రకటిస్తాం. అందరికి సంక్రాంత్రి శుభాకాంక్షలు” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

పాన్ ఇండియా మూవీస్లో అయలాన్ ఒకటి. సైన్స్‌ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ మూవీని ఆర్‌.రవికుమార్ (R Ravikumar) తెరకెక్కిస్తున్నారు. ఇక తెలుగులో గంగా ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర్ రెడ్డి అయలాన్ రిలీజ్ చేస్తున్నాడు.