హీరోయిజం కనిపించేది థియేటర్లో కానీ..OTT లో కాదు

హీరోయిజం కనిపించేది థియేటర్లో కానీ..OTT లో కాదు

పండగ రోజున సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయవద్దన్నారు  లవ్ స్టోరీ నిర్మాత సునీల్ నారంగ్. తాము టక్ జగదీష్  నిర్మాతలతో మాట్లాడామని..వాళ్ళు అమెజాన్ వాళ్ళతో మాట్లాడతామన్నారు. తాము లవ్ స్టోరీని సెప్టెంబర్ 10న థియేటర్స్ లో రిలజ్ చేస్తున్నామన్నారు. అయితే అదే డేట్ న ఓటీటీలో టక్ జగదీష్ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారని.. అదే రోజున కాకుండా కొన్ని రోజుల  తరువాత వేస్తే ఓకేనన్నారు.

విజయేంద్ర రెడ్డి మాట్లాడుతూ..సెప్టెంబర్ 10 న రాకరాక ఒక పెద్ద సినిమా వస్తుంటే దానిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అదే రోజు టక్ జగదీష్ ఓటీటీలో రిలీజ్ చేయకుండా కొంత గ్యాప్ లో రిలీజ్ చెయ్యాలి. ఎగ్జిబిటర్స్ పరిస్థితి దారుణంగా వుంది. ఓటిటి  సిని పరిశ్రమ మనుగడకే సవాల్ గా మారుతుంది. పరిస్థితులు ఇలా వుంటే చాలా థియేటర్స్ మూత పడతాయన్నారు. 

శ్రీధర్ మాట్లాడుతూ..నా సినిమా థియేటర్లో రిలీజ్ చేయడమే నాకు ఇష్టం అన్న నాని ఇప్పుడు నిర్మాతల ఇష్టం అంటున్నారు. థియేటర్స్ బాగుంటేనే నిర్మాతలు బాగుంటారు.  ఇలాగే వుంటే ఓటిటీ వైపు వెళ్ళే నిర్మాతలకు తగిన సమాధానం చెపుతాను. హీరోయిజం అంటే థియేటర్ లోనే కనపడుతుంది కానీ.. ఓటిటీలో కనపడదన్నారు.

బాల గోవింద్ రాజ్ మాట్లాడుతూ.. బాహుబలి లాంటి మూవీ ఓటిటిలో రిలీజ్ అయితే ఇంత పేరు వచ్చేదా.. ఓటిటీ వల్ల టాలీవుడ్ కి చాలా నష్టమన్నారు. మేము నిర్మాతలకు అక్టోబర్ వరకు ఆగమని చెప్పాం. కానీ వాళ్ళు ఓటిటీ వైపు కాకుండా థియేటర్స్ లోనే రిలీజ్ చెయ్యాలంటున్నారన్నారు.