Salaar: డబ్బులు తిరిగి ఇచ్చేసిన సలార్ నిర్మాత.. కారణం ఏంటంటే?

Salaar: డబ్బులు తిరిగి ఇచ్చేసిన సలార్ నిర్మాత.. కారణం ఏంటంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ సలార్(Salaar). బాహుబలి తరువాత సరైన హిట్టు కోసం చేస్తున్న ప్రభాస్, ఆయన ఫ్యాన్స్ కి సలార్ సినిమా కాస్త ఊరట కలిగించింది. మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ గా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రభాస్ ఫ్యాన్స్ నుండి సూపర్ హిట్ టాక్ రాగా.. నార్మల్ ఆడియన్స్ నుండి మాత్రం మిక్సుడ్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో రాబట్టింది ఈ మూవీ. 

నిజానికి కేజేఎఫ్ తరువాత దర్శకుడు ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఆ టైం లో సలార్ సినిమాపై ఉన్న బజ్ కి ఖచ్చితంగా రూ. 1000 కోట్లు కొల్లగొడుతున్నది అనుకున్నారు. కానీ, రూ.710 కోట్ల వద్ద ఆగిపోయింది ఈ మూవీ. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంలో ఆనందంగానే ఉన్నారు. చాలా రోజుల తరువాత తమ హీరో హిట్టు కొట్టాడని సంబరాలు చేసుకున్నారు.

ఇదిలా ఉంటే.. తాజా సమాచారం మేరకు సలార్ ఆంధ్రా డిస్ట్రిబ్యూటర్స్ కి నిర్మాత విజయ్ కిరగందూర్ డబ్బులు తిరిగి ఇచ్చేశాడట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కారణం.. సలార్ సినిమాకు వచ్చిన భారీ హైప్ తో డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాను భారీ ధరకు కొన్నారట. తెలంగాణాలో చాలా మందికి ఈ సినిమా లాభాలు తెచ్చిపెట్టింది కానీ, ఆంధ్రాలో అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. అందుకే అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ లాస్ అవకుండా కొంత డబ్బును తిరిగి ఇచ్చేశాడట నిర్మాత విజయ్. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కన్ఫ్యూజన్ లో పడ్డారు. సలార్ హిట్ అయింది కదా.. అయినా కూడా ఆంధ్రాలో లాస్ రావడం ఏంటి? వారికి డబ్బులు ఇవ్వడం ఏంటి? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సలార్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న సలార్ పార్ట్ 2 షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది.